Begin typing your search above and press return to search.

లడ్డూ వివాదం.. వేణు స్వామి భార్య షాకింగ్ వీడియో!

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం.. దేశవ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే.

By:  Tupaki Desk   |   1 Oct 2024 5:24 AM GMT
లడ్డూ వివాదం.. వేణు స్వామి భార్య షాకింగ్ వీడియో!
X

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వివాదం.. దేశవ్యాప్తంగా ఎంతటి చర్చనీయాంశమైందో అందరికీ తెలిసిందే. అనేకమంది రాజకీయ నేతలు, పండితులు, బ్రాహ్మణులు సహా పలువురు ప్రముఖులు స్పందించారు. అయితే ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు అవ్వడంతో సోమవారం విచారణ ప్రారంభమైంది. పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు.. తదుపరి విచారణను వాయిదా వేసింది.

అయితే కల్తీ జరిగిందనే దానిపై ఎలాంటి ఆధారాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా ప్రకటన చేస్తారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దేవుళ్లను రాజకీయం చేయొద్దని హితవు పలికింది. టీటీడీ ఈవో ప్రకటన ప్రకారం.. కల్తీ నెయ్యిని ఉపయోగించలేదని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్న వేళ.. ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి భార్య శ్రీవాణి రెస్పాండ్ అయ్యారు.

షాకింగ్ కామెంట్స్ చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. పరమపవిత్రమైన తిరుపతి లడ్డూ కోసం సోషల్ మీడియాలో చాలా రచ్చ చేశారని ఆరోపించారు. ప్రజలు, భక్తుల మనోభావాలను హింసించేశారని అంటూ రాజకీయ నాయకులను పక్కన బెడితే.. ప్రవచన కర్తలు, పండితులు, బ్రాహ్మణులు ఓవర్ యాక్టింగ్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రాయశ్చిత్త శ్లోకాలు వారే కనిపెట్టేసి.. వాటిని చెప్పించేసి, ఏమన్నా రచ్చ చేశారా..

ఎంతమంది తిరుమల శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నారో తెలుసా అని ప్రశ్నించారు. మరి ఇప్పుడేం చేస్తారు మీ అందరూ అని క్వశ్చన్ చేస్తూ. నిజమైన హిందువులు అయితే.. నిజంగా స్వామివారి భక్తులు అయితే.. క్షమించండి అని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టండని చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు.. వైరల్ గా మారాయి. వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.

అయితే శ్రీవాణి.. వీణతో ప్రదర్శనలిస్తూ వీణ శ్రీవాణిగా పేరు సంపాదించుకున్నారు. ఇటీవల అంబానీ ఇంట వివాహ వేడుకలో ప్రదర్శన ఇచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. కొన్ని రోజుల క్రితం తన భర్త వేణు స్వామి, జర్నలిస్టు మూర్తి వ్యవహార సమయంలో వీడియో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తిరుమల లడ్డూ వివాదంపై వీడియో రిలీజ్ చేశారు. మరి ఆమె వ్యాఖ్యలపై ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో చూడాలి