ఎల్లమ్మ కోసం వారిని సెట్ చేసిన వేణు
బలగం సినిమా వచ్చి ఇంత టైమ్ అవుతున్నా వేణు తన తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి చాలానే టైమ్ పట్టింది.
By: Tupaki Desk | 31 March 2025 7:26 AMఅప్పటివరకు కమెడియన్ గా ఉన్న వేణు యెల్దండి సడెన్ గా బలగం సినిమాతో డైరెక్టర్ గా మారడమే షాకిస్తే, ఆ సినిమా అందరి అంచనాలను మించి బ్లాక్ బస్టర్ గా నిలిచి మరో సర్‌ప్రైజ్ ఇచ్చింది. బలగం మూవీని దిల్ రాజు తన బ్యానర్ లో రిలీజ్ చేయడం వల్ల ఆ సినిమా రేంజ్ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లింది. ఈ సినిమాతో వేణుకి కూడా చాలా మంచి క్రేజ్ వచ్చింది.
ఎప్పుడూ స్క్రీన్ పై నవ్వుతూ, నవ్విస్తూ ఉండే వేణు లో ఇంత ఎమోషన్ ఉందా? అనిపించడంతో పాటూ బలగం లాంటి సెన్సిటివ్ కథను వేణు హ్యాండిల్ చేసిన విధానం అందరినీ మెప్పించింది. బలగం సక్సెస్ తర్వాత వేణు మరో ప్రాజెక్టును కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేయడానికి డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఎల్లమ్మ టైటిల్ తో వేణు సినిమా చేయనున్నాడని దిల్ రాజు ఎప్పట్నుంచో చెప్పుకుంటూ వస్తున్నారు.
ఎల్లమ్మను వేణు ముందు నానితో చేయాలనుకుని నానికి కథ చెప్పాడు. వేణు చెప్పిన ఫైనల్ వెర్షన్ నానికి సంతృప్తిని ఇవ్వకపోవడంతో వేణు అదే కథను నితిన్ కు చెప్పి ప్రాజెక్టును ఓకే చేయించుకున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తమ్ముడు సినిమా చేస్తున్న నితిన్, దిల్ రాజు బ్యానర్ అనగానే సినిమాను ఓకే చేశాడు.
బలగం సినిమా వచ్చి ఇంత టైమ్ అవుతున్నా వేణు తన తర్వాతి సినిమా మొదలుపెట్టడానికి చాలానే టైమ్ పట్టింది. ఇదిలా ఉంటే ఎల్లమ్మకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం వేణు తన తర్వాతి సినిమా ఎల్లమ్మ కోసం గత వారం సిరిసిల్ల, నిజామాబాద్ తో పాటూ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో పర్యటించినట్టు తెలుస్తోంది.
ఎల్లమ్మ కోసం స్టేజ్ ఆర్టిస్టులను సెలెక్ట్ చేయడానికే వేణు ఈ పర్యటన చేసినట్టు తెలుస్తోంది. ఆల్రెడీ కొంతమందిని నటీనటులను ఎంపిక కూడా చేశారని సమాచారం. ఈ సందర్భంగా వేణు కొన్ని నాటకాలను డైరెక్ట్ గా చూసి, అందులో నుంచి మంచి టాలెంట్ ఉన్న వారిని ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఎల్లమ్మతో డైరెక్టర్ గా నెక్ట్స్ లెవెల్ కు వెళ్లాలని చాలా గట్టిగానే ట్రై చేస్తున్నాడు వేణు. ఇక నితిన్ విషయానికొస్తే ప్రస్తుతం రాబిన్‌హుడ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న యంగ్ హీరో, తమ్ముడు సినిమా రిలీజయ్యాక వేణుతో కలిసి ఎల్లమ్మను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నాడు.