Begin typing your search above and press return to search.

ఆ హీరో దగ్గరికి ఎల్లమ్మ ?

ఐతే అందుకు తగినట్టుగానే వేణు ఎల్లమ్మ కథ సిద్ధం చేయడం దాన్ని తెరకెక్కించాలని చూడటం జరిగింది.

By:  Tupaki Desk   |   30 July 2024 12:17 PM GMT
ఆ హీరో దగ్గరికి ఎల్లమ్మ ?
X

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వేణు ఎల్దండి డైరెక్ష లో ఎల్లమ్మ అనే సినిమా రాబోతుందని మొన్నామధ్య వార్తలు వచ్చాయి. కమెడియన్ గా తన మార్క్ చాటుతూ వచ్చిన వేణు లో ఇంత మంచి గొప్ప దర్శకుడు ఉన్నాడా అని బలగం సినిమా చూసిన వారు అనుకున్నారు. ఐతే బలగం చూసిన తర్వాత నాని మంచి కథతో వస్తే వేణు తో చేసేందుకు సిద్ధమని చాలా సార్లు చెప్పాడు. ఐతే అందుకు తగినట్టుగానే వేణు ఎల్లమ్మ కథ సిద్ధం చేయడం దాన్ని తెరకెక్కించాలని చూడటం జరిగింది.


దిల్ రాజు బ్యానర్ లో తెరకెక్కాల్సిన ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లకుండానే క్యాన్సిల్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు రెమ్యునరేషన్ ఎక్కువ అడిగాడని కొందరు అంటుంటే.. సినిమా బడ్జెట్ వేణు ఎక్కువ కోట్ చేయడం అని కొందరు అంటున్నారు. ఐతే ఏది ఏమైనా ఎల్లమ్మ ప్రస్తుతానికి హోల్డ్ లో పడిందని తెలుస్తుంది. ఐతే నాని దాదాపు ఆ ప్రాజెక్ట్ చేసేందుకు అంతగా ఆసక్తి లేదన్నట్టుగానే ఉన్నాడట. అందుకే వేణు ఎల్లమ్మ కథను నాని దగ్గర నుంచి మరో హీరో దగ్గరకు తీసుకెళ్లాడని తెలుస్తుంది.

నాని కాదన్న ఈ ఎల్లమ్మ కథను శర్వానంద్ కి వినిపించాడట వేణు. ఆల్రెడీ బలగం తో తన డైరెక్షన్ టాలెంట్ చూపించిన వేణు చెప్పిన కథ నచ్చడంతో శర్వానంద్ కూడా ఈ కథకు ఇంప్రెస్ చేయించాడని తెలుస్తుంది. నాని నుంచి ఎల్లమ్మ కథ శర్వానంద్ దగ్గరకు వెళ్లినట్టు తెలుస్తుంది. ఐతే ఎల్లమ్మ కథ కూడా బలగం లానే ఎమోషనల్ కథతో వస్తుందని తెలుస్తుంది.

శర్వానంద్ తో అయినా ఎల్లమ్మ సినిమా ఓకే అవుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది. ఐతే హీరో ఎవరన్నది తర్వాత అనుకుని వేణు సినిమా స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టినట్టు తెలుస్తుంది. వేణుతో శర్వానంద్ సినిమా కన్ఫర్మ్ అయితే మాత్రం శర్వా ఖాతాలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ వచ్చినట్టే లెక్క. ఈమధ్యనే మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వానంద్ ఒక సూపర్ హిట్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. మరి అది ఈ ఎల్లమ్మ కథే అవుతుందా లేదా అన్నది చూడాలి. ఒకవేళ శర్వానంద్ ఎల్లమ్మ చేసి హిట్ కొడితే మాత్రం నాని కచ్చితంగా ఒక హిట్ సినిమా మిస్ అయ్యామని ఫీల్ అవ్వక తప్పదు.