Begin typing your search above and press return to search.

సమంతలా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు: వేణు స్వామి

ఎన్నికలకి ముందు సోషల్ మీడియాలో ఆయన ప్రెడిక్షన్స్ ఎక్కువ వైరల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   16 Aug 2024 9:15 AM GMT
సమంతలా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకూడదు: వేణు స్వామి
X

సెలబ్రెటీ ఆస్ట్రాలజర్ గా పాపులర్ అయిన వేణు స్వామి గత కొంతకాలంగా కాంట్రవర్సీలకి కేరాఫ్ గా మారిపోయారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ, బీఆర్ఎస్ మళ్ళీ గెలిచి అధికారంలోకి వస్తాయని ఆయన ప్రెడిక్షన్ చెప్పారు. ఎన్నికలకి ముందు సోషల్ మీడియాలో ఆయన ప్రెడిక్షన్స్ ఎక్కువ వైరల్ అయ్యాయి. అయితే ఈ రెండు రాష్ట్రాలలో ఆయన ప్రెడిక్షన్ కి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి. దీంతో అప్పటి నుంచి వేణు స్వామి మీద ట్రోలింగ్ మొదలైంది.

ఇవన్నీ ఇలా ఉంచితే ఈ నెల 8వ తేదీని నాగ చైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ జరిగింది. ఆ మరుసటి రోజే వేణు స్వామి వారి వైవాహిక జీవితం ఎక్కువ కాలం నిలవదు అంటూ ప్రెడిక్షన్ చెప్పారు. మూడేళ్ళలో విడిపోతారని వీడియో రిలీజ్ చేశారు. ఈ ప్రెడిక్షన్ ని చాలా మంది తప్పు పట్టారు. సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వచ్చాయి. మీడియా ఛానల్స్ లో కూడా వేణు స్వామి వ్యాఖ్యలని తప్పు పట్టారు.

జర్నలిస్ట్ సంఘాలు వేణు స్వామిపై మహిళ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. మహిళ కమిషన్ కూడా వేణు స్వామికి ఈ ప్రెడిక్షన్ పై వివరణ ఇవ్వాలని నోటీసులు ఇచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు స్వామి మరో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో వేణు స్వామి సమంతకి క్షమాపణలు చెప్పారు. నాతో నీ జాతకం చెప్పించిన, వ్యక్తులు, సంస్థలు తరపున, అలాగే నీ పట్ల జాలి లేకుండా రాక్షస భావజాలంతో ప్రవర్తించిన తెలుగు సమాజం, తెలుగు ప్రజల తరపున నేను క్షమాపణలు కోరుతున్నాను.

ఒక అమ్మాయికి జరిగిన మానసిక, వైవాహిక నష్టాన్ని ఎవరు భరించలేరు. ఈ విషయంలో నీకు నేను ధైర్యం చెప్పడం తప్ప ఇంకేమీ చేయలేను. ఇకపై నీ జీవితం బాగుండాలని, మాయోసైటిస్ ని అధికమించాలని, మరల వివాహం చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకుంటున్నాను. అలాగే కొందరు బలవంతంగా నాతో నీ జాతకం ఆ రోజు చెప్పించారు. అలాగే నువ్వు మాయోసైటిస్ బారిన పడటానికి సోషల్ మీడియాలో ద్వారా, అలాగే వివిధ మాధ్యమాల ద్వారా మానసికంగా నువ్వు అనుభవించిన క్షోభ కారణం.

తెలుగు ప్రజలు అందరూ నీ మీద ఎప్పుడు జాలి చూపించలేదు. నిన్నే దోషిగా ప్రతిసారి చూపించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో ఛానల్స్, ప్రజలు నీ మీద సింపతీ చూపిస్తున్నారు. నీకు జరిగిన నష్టాన్ని, కష్టాన్ని చూసి సంఘీభావం తెలుపుతున్నారు. నువ్వు తెలుగమ్మాయి కాకపోవడం వలన నీ మీద తెలుగు సమాజం సింపతీ చూపించడం లేదు. నీకు ఎక్కడ సింపతీ వస్తుందో అని మొత్తం సబ్జెక్టుని డైవర్ట్ చేయడానికి ఎదో కుట్రలో భాగంగా నా మీద ట్రోలింగ్, విమర్శలు మొదలుపెట్టారు.

సమంతలా ఇంకొక అమ్మాయి జీవితం నాశనం కాకూడదని నాకు నేనుగా శోభిత జాతకాన్ని విశ్లేషించి చెబితే ఇప్పుడు దానిని హైలైట్ చేస్తూ సమంత సమస్యని చిన్నదిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరో తమిళ్ వాడు ఇలా జాతకం చెబితే నెత్తిన పెట్టుకునేవారు. కానీ తెలుగువాడిని కాబట్టి బండబూతులు తిట్టి, రోడ్డు మీదకి లాగుతున్నారు. ఇదంతా ఒక పద్ధతిగా జరుగుతున్న కుట్ర.. అంటూ వేణు స్వామి వీడియో రిలీజ్ చేశారు.