Begin typing your search above and press return to search.

ఆ హౌజ్ కి వేణు స్వామి.. వార్తల్లో నిజం ఎంత..?

అంతేకాదు ఏపీ ఎలక్షన్ రిజల్ట్ గురించి కూడా ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజం అవ్వలేదు.

By:  Tupaki Desk   |   19 July 2024 5:30 AM GMT
ఆ హౌజ్ కి వేణు స్వామి.. వార్తల్లో నిజం ఎంత..?
X

తెలుగు రెండు రాష్ట్రాలకు అసలేమాత్రం పరిచయం అవసరం లేని పేరు వేణు స్వామి. ప్రముఖ ఆస్ట్రాలజర్ అయిన వేణు స్వామి సెలబ్రిటీస్ ఇళ్లల్లో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. ఆయన జ్యోతిష్యం కూడా చెబుతుంటారు. సెలబ్రిటీస్ గురించి జరిగేది ఇదే అంటూ ఆయన చెప్పినవి కొన్ని నిజం కాగా మరికొన్ని నిజం కాలేదు. ఐతే ఈమధ్య ఆయన ఒక ప్రముఖ హీరో గురించి అతని కెరీర్ పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ వల్ల అతని ఫ్యాన్స్ బాగానే వేణు స్వామిని టార్గెట్ చేశారు.

అంతేకాదు ఏపీ ఎలక్షన్ రిజల్ట్ గురించి కూడా ఆయన చెప్పిన జ్యోతిష్యం నిజం అవ్వలేదు. దీని వల్ల వేణు స్వామి ఇక మీదట సెలబ్రిటీస్ గురించి అసలు ఏమీ మాట్లాడనని చెప్పాడు. ఐతే సోషల్ మీడియాలో మాత్రం ఆయన గురించి అక్కడో ఇక్కడో వినిపిస్తూనే ఉంటుంది. లేటెస్ట్ గా వేణు స్వామి గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆయన ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ కి వెళ్తున్నారని అంటున్నారు.

ఏడు సక్సెస్ ఫుల్ సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ సీజన్ 8 కి రంగం సిద్ధం చేస్తుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక మొదలైనట్టు తెలుస్తుంది. ఐతే ఈసారి ఎక్కువగా సోషల్ మీడియా సెలబ్రిటీస్ మీద ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తుంది. నిత్యం వార్తల్లో ఉండే వారి మీద బిగ్ బాస్ టీం ఒక కన్నేశారట. ఈ క్రమంలో వేణు స్వామిని కూడా బిగ్ బాస్ హౌజ్ కి తీసుకు రావాలని అనుకుంటున్నారట.

బిగ్ బాస్ హౌజ్ లో వేణు స్వామి వెళ్లడం అంటూ జరిగితే స్పెషల్ గా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బిగ్ బాస్ టీం వేణు స్వామికి భారీ రెమ్యునరేషన్ ఇచ్చి మరీ సెలెక్ట్ చేస్తున్నారట. ఈ వార్తల్లో వాస్తం ఎంత ఉంది అన్నది తెలియదు కానీ బిగ్ బాస్ హౌజ్ కి వేణు స్వామి వస్తే మాత్రం మిగతా కంటెస్టెంట్స్ అందరికీ ఆయన జాతకాలు చెప్పే ఛాన్స్ ఉంటుంది.

వేణు స్వామి మాత్రమే కాదు కుమారి ఆంటీ, బర్రెలక్క ఇలానే సోషల్ మీడియాలో ఏదో ఒకవిధంగా ట్రెండింగ్ లో ఉన్న వారిని బిగ్ బాస్ సీజన్ 8లో తీసుకుంటున్నారట. కింగ్ నాగార్జున హోస్ట్ గా రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 8 త్వరలోనే ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది. సీజన్ 8 లో స్టార్ కంటెస్టెంట్స్ తో పాటుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉన్న వారిని కూడా తీసుకుంటున్నారని తెలుస్తుంది.