పవన్ కల్యాణ్ రాజకీయ భవిష్యత్‌పై వేణు స్వామి జోశ్యం
ఇటీవల పవన్ కల్యాణ్ కి మూడవ భార్య అన్నా లెజినోవాతో సమస్యలున్నాయని ..వేణుస్వామి అనేకసార్లు ప్రస్థావించాడు.
By: Tupaki Desk | 25 May 2024 11:30 PM GMTప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి పరిచయం అవసరం లేదు. జ్యోతిషశాస్త్రంలో ఆయన ప్రతిభ, అంచనాలు ఏనాడూ విఫలం కాకపోవడంతో అతడిని అనుసరించే సెలబ్రిటీలు, ప్రజల సంఖ్య ఇటీవల పెరిగింది. ఇంతకుముందు టాలీవుడ్ లో ప్రముఖ జంటల విడాకుల గురించి చాలా ముందే ధైర్యంగా ప్రస్థావించిన జ్యోతిష్కుడు అతడు. పలువురి విడాకుల గురించి బహిరంగంగా ప్రకటించిన అతడి జోశ్యం ఫలించడమే కాకుండా చాలా మంది సెలబ్రిటీల జీవితంలో ఎదుగుదల లేదా ఉత్తాన పతనాల గురించి అతడు చెప్పినవి నిజం కావడంతో అతడి వెంట అన్ని వర్గాల ప్రజలు క్యూ కడుతున్నారు. సమంతా రూత్ ప్రభు - నాగ చైతన్య జంట విడాకుల గురించి వేణు స్వామి చాలా ముందే ప్రకటించాడు.
ఇటీవల పవన్ కల్యాణ్ కి మూడవ భార్య అన్నా లెజినోవాతో సమస్యలున్నాయని ..వేణుస్వామి అనేకసార్లు ప్రస్థావించాడు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు, రాజకీయాలలో పవన్ కళ్యాణ్ భవిష్యత్తు గురించి ఆయన చేసిన సూచన కారణంగా ఇప్పుడు మళ్ళీ వినోద పరిశ్రమలో స్వామి సంచలనం సృష్టిస్తున్నాడు. లోక్‌సభ ఎన్నికలలో జనసేనాని పవన్ కళ్యాణ్ మిత్రపక్షాలతో కలిసి పోటీ చేసారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనను అంతమొందించడమే ధ్యేయంగా వారంతా బరిలో దిగారు. ఆంధ్ర ప్రదేశ్ లోని పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పవన్ పోటీ చేసారు. ఎన్నికల ఫలితం జూన్ 4 న ప్రకటించనున్నారు. అటువంటి పరిస్థితిలో వేణు స్వామి తన జాతకంలో రాజయోగం లేనందున పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలవలేరని చెప్పాడు. పవన్ కల్యాణ్ ఎప్పటికీ ఎపీ రాజకీయాల్లో పాలకుడి స్థాయికి ఎదగలేరని ఆయన అన్నారు.
ఈసారి సంకీర్ణ పార్టీ పాలన చేసే అవకాశం ఉందని వేణు స్వామి జోశ్యం చెప్పారు. పాలక వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తరిమేయాలనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల రింగ్‌లో నిలబడ్డాడు. బిజెపి-టిడిపి పార్టీలతో కూటమిగా పోటీ చేశారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరపున పోటీపడిన వంగా గీతాపై పిఠాపురం నుంచి పవన్ పోటీ చేసారు. భారతదేశంలో ఎన్నికల సందడి నడుమ వేణు స్వామి తాజా ప్రకటన, అతడి అంచనాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
మరోవైపు పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తదుపరి గ్యాంగ్ స్టర్ డ్రామా OG విడుదలకు రావాల్సి ఉంది. దీనికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో ఇమ్రాన్ హష్మి , ప్రియాంక మోహన్ తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఓజీ తరువాత `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో పవన్ కనిపిస్తాడు. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీలీల ఒక అతిథి పాత్రలో నటించింది. ఈ చిత్రం 150 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కనుందని సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ స్వరాల్ని అందిస్తున్నారు. అలాగే క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమాలో నటిస్తుండగా అది ఆలస్యమైన సంగతి తెలిసిందే.