2030 వరకూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదు: వేణు స్వామి
ఇలాంటి సమయంలో ఇంకా దీనిపై ఎన్టీఆర్ స్థబ్ధుగానే ఉన్నాడు. కనీసం పార్టీ ప్రచారానికి అయినా తారక్ వస్తారా లేదా? అన్నది సస్పెన్స్ గానే ఉంది.
By: Tupaki Desk | 14 March 2024 11:30 AM GMTసమయం వచ్చినప్పుడు తమ్ముడు (జూనియర్ ఎన్టీఆర్) రాజకీయాల్లోకి వస్తాడు.. అయితే అతడు ఎప్పుడు వస్తాడనేది పూర్తిగా తన ఆలోచన!! అని నందమూరి తారకరత్న ఇంతకుముందు ఓ సందర్భంలో వ్యాఖ్యానించారు. అవును.. నిజమే జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలంటే సరైన సమయం రావాలి.
ఎన్నికలొస్తున్నాయి కదా? జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి కాన్వాస్ చేస్తారా? అని కూడా ప్రశ్న ఎదురవుతోంది. చాలా కాలం క్రితం క్రియాశీల రాజకీయాల నుండి విరామం తీసుకున్న జూనియర్ ఎన్టీఆర్ తిరిగి టిడిపిలోకి వస్తారా రారా? అన్నది ఇంకా సస్పెన్స్‌లోనే ఉంది. చాలా మంది టీడీపీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ రావాలనే కోరుకుంటున్నారు.
2024 ఎన్నికల బరిలో తెలుగు దేశం పార్టీ గెలిచి తీరాల్సిన సన్నివేశం ఉంది. ఇలాంటి అరుదైన సమయంలో జూనియర్ బరిలో దిగాలని కూడా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జనసేన, భాజపాలతో జట్టు కట్టినా కానీ తెలుగు దేశంలో ఇంకా పూర్తి కాన్ఫిడెన్స్ కనబడటం లేదని కూడా విశ్లేషిస్తున్నారు కొందరు. ఇలాంటి సమయంలో ఇంకా దీనిపై ఎన్టీఆర్ స్థబ్ధుగానే ఉన్నాడు. కనీసం పార్టీ ప్రచారానికి అయినా తారక్ వస్తారా లేదా? అన్నది సస్పెన్స్ గానే ఉంది.
అయితే తారక్ పూర్తిగా సినిమాలతో బిజీగా ఉన్నందున క్రియాశీల రాజకీయాల్లోకి రావడం ఇప్పట్లో కుదరదని కూడా విశ్లేషిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర (#NTR30) పూర్తి చేయగానే, KGF ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తన తదుపరి చిత్రం చేస్తాడని ఊహిస్తున్నారు. ఒకవేళ జూనియర్ మళ్లీ టీడీపీలోకి వస్తున్నారంటే అది ఈపాటికే జరిగి తీరాలని కూడా విశ్లేషిస్తున్నారు. అతడు రాలేదు అంటే ఇక రాడు అనే అర్థమని భావిస్తున్నారు.
ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ తమ తాత ప్రారంభించిన పార్టీ కాబట్టి తాము ఎప్పుడూ టీడీపీతోనే ఉంటామని గతంలో ప్రకటించారు. నిజమే .. దానికి తగ్గట్టుగా సింప్టమ్స్ ఏవైనా కనిపించాలి కదా? ఎన్టీఆర్ ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తలేదు! అంటే దీనర్థం సినిమాలే తన ప్రధానమైన ఫోకస్.. ఇప్పట్లో తన రూటు మారదు అని నిరూపిస్తున్నాడు.
ఇప్పుడు ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్కుడు వేణు స్వామి చేసిన ఓ వ్యాఖ్య తెలుగు దేశం పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ ఆయన ఏమని వ్యాఖ్యానించారు? అంటే... 2030 వరకూ జూ.ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదు..! అని అన్నారు. ఆ మేరకు తాను చాలా కాలం క్రితమే జోశ్యం చెప్పానని వేణు స్వామి తెలిపారు. తిరుమల వెంకన్న సామి హుండీ దగ్గర కలిసినప్పుడే తాను జూనియర్ తల్లిగారికి కుమారుని రాజకీయ ఆరంగేట్రం గురించి చెప్పానని, ఇప్పట్లో అతడు రాజకీయాల్లోకి రాకూడదని వారించానని కూడా తెలిపారు. 2029 ముగిసే వరకూ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాకూడదని వచ్చినా కలిసి రాదని తాను జ్యోతిష శాస్త్రం ప్రకారం చెప్పానని వేణు స్వామి అన్నారు.