8 గంటల సినిమా ప్రేక్షకులు చూసింది ఐదున్నర గంటలే!
ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమా విశేషాల్ని వెట్రీమారన్ పంచుకున్నారు. 'విడుదల మొదటి భాగం 2 గంటల 40 నిమిషాలంటే విడుదల -2 రెండు గటల 50 నిమిషాలుంటుంది.
By: Tupaki Desk | 21 Dec 2024 12:14 PM GMTమక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సూరి కథానాయకులుగా వెట్రీమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'విడుదల-2' ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. తమిళ్, తెలుగులో సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ నటనతో మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సూరి పాత్ర చిన్నదైనా? ఉన్నంత సేపు ఎంతో ఎగ్జైట్ మెంట్ ఎంతో ఎగ్జైట్ మెంట్ ని తీసుకొచ్చింది. మంజు వారియర్, గౌతమ్ మీనన్, భవానీ శ్రీ పాత్రలు ఆకట్టుకున్నాయి.
త్వరలో ఓటీటీ వెర్షన్ కూడా రిలీజ్ అవుతుంది. అయితే ఓటీటీలో ఎక్స్ టెండెడ్ వెర్షన్ తో రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆ సినిమా విశేషాల్ని వెట్రీమారన్ పంచుకున్నారు. 'విడుదల మొదటి భాగం 2 గంటల 40 నిమిషాలంటే విడుదల -2 రెండు గటల 50 నిమిషాలుంటుంది. మొత్తం సినిమా రన్ టైమ్ మొత్తం 8 గంటలు ఉంటుంది. కానీ నేను ప్రేక్షకులకు చూపించింది 5 గంటల 30 నిమిషాలే. విడుదల-2 ఎక్స్ టెండెడ్ వెర్షన్ ఓటీటీలో విడుదల చేస్తాం.
మరో గంట నిడివితో ఉన్న పుటేజ్ ఓటీటీలో యాడ్ అవుతుంది' అని తెలిపారు. గంట సినిమా అదనంగా యాడ్ అవుతుంది? అంటే మళ్లీ థియేటర్లో చూసిన ఆడియన్స్ మళ్లీ ఓటీటీలో ప్రెష్ గా చూడొచ్చు. కథకు కంటున్యూటీ ఉంటుంది? కాబట్టి థియేటర్లో ఆస్వాదించిన వారందరికీ ఓటీటీలో చూడాలనే ఆసక్తి కచ్చితంగా ఉంటుంది. ఓటీటీలోనే చూసే ప్రత్యేకమైన ఆడియన్స్ ఎలాగూ ఉంటారు. ఆ రకంగా వెట్రీమారన్ రెండు రకాల ఆడియన్స్ ని ఓటీటీకి తీసుకొస్తున్నాడు.
సినిమాకు ఎలాగూ హిట్ టాక్ ఉంది కాబట్టి ఓటీటీ వెర్షన్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. కొత్త సినిమాల రిలీజ్ విషయంలో ఇప్పుడిదో ట్రెండ్. 'ఆర్ ఆర్ ఆర్' డాక్యుమెంటరనీ కూడా కొన్ని థియేటర్లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఇమేజ్ తో అక్కడా మంచి రెస్పాన్స్ వస్తోంది.