చివరి నిమిషంలో 8 నిమిషాలు కట్
సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు వెట్రిమారన్ ఒక వీడియోను విడుదల చేశాడు.
By: Tupaki Desk | 19 Dec 2024 1:29 PM GMTసూరి ప్రధాన పాత్రలో వచ్చిన 'విడుదల పార్ట్ 1' తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో విడుదల పార్ట్ 2 పై అంచనాలు అన్ని చోట్ల భారీగా ఉన్నాయి. పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న విడుదల పార్ట్ 2 ప్రమోషన్స్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. మొదటి పార్ట్ పూర్తిగా సూరి కనిపించగా, రెండో పార్ట్ పూర్తిగా విజయ్ సేతుపతి కనిపించబోతున్నట్లుగా ట్రైలర్, టీజర్, పోస్టర్స్ చూస్తే అర్థం అవుతుంది. నక్సలైట్ బ్యాక్‌గ్రౌండ్‌లో రూపొందిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి నక్సలైట్‌గా కనిపించబోతున్నాడు. తాజాగా సినిమాపై అంచనాలు పెంచుతూ ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు.
సినిమా రన్ టైమ్ విషయంలో పెద్ద చర్చ జరిగింది. రెండు మూడు రోజుల క్రితం సినిమాకు 2 గంటల 50 నిమిషాల రన్ టైమ్‌ను ఖరారు చేసినట్లుగా చెప్పుకొచ్చారు. సెన్సార్‌కి అదే వెళ్లింది. రన్ టైమ్ విషయంలో విమర్శలు రావడంతో చివరి నిమిషంలో రన్ టైం తగ్గించారని తెలుస్తోంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసిన దర్శకుడు వెట్రిమారన్ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమాకి సంబంధించిన వర్క్ ఇప్పుడే పూర్తి అయ్యింది. సినిమా కోసం చివరి నిమిషం వరకు వర్క్ చేస్తూనే ఉన్నాం. విడుదలకు ముందు 8 నిమిషాలు ట్రిమ్ చేశౄమని పేర్కొన్నాడు.
ఈ సినిమా తనకు గొప్ప అనుభూతిని ఇచ్చిందని అన్నాడు. అంతే కాకుండా మా నుంచి ఈ సినిమా కోసం చాలానే కష్టపడ్డాం. తప్పకుండా ప్రతి ఒక్కరిని అలరిస్తుందనే నమ్మకం ఉందని చెప్పుకొచ్చాడు. విడుదల పార్ట్ 2 పై తెలుగులోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమాలో విజయ్ సేతుపతికి జోడీగా మంజు వారియర్ నటించడంతో మలయాళంలోనూ అంచనాలు పెరిగాయి. సినిమాలో విజయ్ సేతుపతి యంగ్ లుక్‌లో ఆకట్టుకున్నాడు. వెట్రిమారన్ సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి, ఆ సినిమాల మాదిరిగానే ఈ సినిమా సైతం విభిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.
విడుదల పార్ట్ 1 భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా చాలా ఆలస్యంగా విడుదల పార్ట్ 2న మొదలు పెట్టారు, పైగా మొదట అనుకున్న కథ కాకుండా పూర్తిగా మార్చి పాన్ ఇండియా రేంజ్‌లో ఆకట్టుకునే విధంగా ఆసినిమాను రూపొందించారు. మొదటి పార్ట్ వచ్చి చాలా కాలం అయినా ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గలేదు. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు ప్రేక్షకులు నమ్మకంగా ఉన్నారు. చివరి నిమిషంలో రన్ టైం తగ్గించడం అనేది మంచి నిర్ణయంగా పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.