Begin typing your search above and press return to search.

2025 లోనే యంగ్ టైగ‌ర్ తో వెట్రీమార‌న్!

ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగా త‌మిళ్ డైరెక్ట‌ర్ వెట్రీమార‌న్ తో సినిమా చేయాల‌ని ఉంద‌న్న ఆస‌క్తిని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   21 Sep 2024 5:30 PM GMT
2025 లోనే యంగ్ టైగ‌ర్ తో వెట్రీమార‌న్!
X

ఇటీవ‌లే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చెన్నైలో `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగా త‌మిళ్ డైరెక్ట‌ర్ వెట్రీమార‌న్ తో సినిమా చేయాల‌ని ఉంద‌న్న ఆస‌క్తిని వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. మీడియా ముఖంగానే వెట్రీమార‌న్ రెడీ అంటే? నేను రెండూ తార‌క్ త‌మిళ సినిమా ఒకే చేసాడు. ప్రేక్ష‌కులు ఇదంతా చూసి తార‌క్ ఏదో స‌ర‌దాగా చెబుతున్నాడ‌నుకున్నారంతా. `దేవ‌ర` ప్ర‌మోష‌న్ లో భాగంగా వెట్రిమార‌న్ గొప్ప‌త‌నాన్ని చెప్పే ఓ ప్ర‌య‌త్నం అనుకున్నారు.

కానీ అస‌లు సంగ‌తేంటి? అంటే ఇద్ద‌రి మ‌ధ్య స్టోరీ డిస్క‌ష‌న్ జ‌ర‌గ‌డం, స్టోరీ లాక్ అవ్వ‌డం కూడా జ‌రిగింద‌న్న సంగ‌తి ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వెట్రీమార‌న్ రివీల్ చేసారు. ఎన్టీఆర్ కి ఒప్ప‌టికే ఓ స్క్రిప్ట్ వినిపించాను. ఇప్పుడు చేస్తున్న సినిమాలు పూర్తికాగానే ఆయ‌న సినిమాపై దృష్టి పెడ‌తాను అని అన్నారు. దీంతో తార‌క్-వెట్రీమార‌న్ సినిమాకి ఎంతో స‌మ‌యం పట్టే అవ‌కాశం లేదనిపిస్తుంది.

అక్టోబ‌ర్ నుంచి ప్ర‌శాంత్ నీల్ తార‌క్ తో చిత్రాన్ని ప్రారంభిస్తారు. అప్ప‌టి నుంచి రెగ్యుల‌ర్ గా షూటింగ్ జ‌రుగుతుంది. అయితే తార‌క్ మాత్రం జ‌న‌వ‌రి నుంచి షూట్ కి హాజ‌ర‌వుతారు. అది పూర్త‌యిన వెంట‌నే `దేవ‌ర‌-2` షూటింగ్ లో పాల్గొంటారు. ఆ త‌ర్వాత తార‌క్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ క‌మిట్ మెంట్ ఏ ద‌ర్శ‌కు డికి లేదు. ఆ లెక్క‌న చూస్తే వెట్రీమార‌న్ ని రంగంలోకి దించే అవ‌కాశం ఉంది.

`దేవ‌ర -2` షూట్ 2025 ఏడాది ముగింపుక‌ల్లా పూర్త‌వుతుంది. అదే ఏడాది చివ‌ర్లో త‌మిళ ద‌ర్శ‌కుడి ప్రాజెక్ట్ ని తార‌క్ ప‌ట్టాలె క్కించినా ఆశ్య‌ర్య‌పోవాల్సిన ప‌నిలేదు. సందీప్ రెడ్డి వంగ‌ తోనూ తార‌క్ సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు. కానీ ఆ కాంబో ఇప్ప‌ట్లో సాధ్యం కాదు. మ‌రో రెండేళ్లు అయినా ప‌ట్టే అవ‌కాశం ఉంటుంది.