Begin typing your search above and press return to search.

స్టార్స్ రెమ్యునరేషన్ పై వెట్రిమారన్ పంచ్..!

దీనిపై ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. లేటేస్ట్ గా స్టార్ రెమ్యునరేషన్ పై డైరెక్తర్స్ అన్ కట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చర్చించారు.

By:  Tupaki Desk   |   24 Sep 2024 12:24 PM GMT
స్టార్స్ రెమ్యునరేషన్ పై వెట్రిమారన్ పంచ్..!
X

ఒక సినిమా సక్సెస్ అయ్యింది అంటే మేజర్ ఫ్యాక్టర్ కథ కథనాలను బట్టే అయినా స్టార్ సినిమా కమర్షియల్ లెక్కల్లో చూస్తే తెర మీద స్టార్ హీరో కనిపిస్తేనే కానీ టికెట్లు తెగే పరిస్థితి కనిపించదు. ఐతే ఈమధ్య స్టార్ హీరోల సినిమాలు ఎలా అయితే వందల కోట్లు వసూలు చేస్తున్నాయో ఆ సినిమాల బడ్జెట్ స్టార్స్ రెమ్యునరేషన్ కూడా అలానే కోట్లు దాటిపోతున్నాయి. దీనిపై ఎప్పుడు చర్చ జరుగుతూనే ఉంటుంది. లేటేస్ట్ గా స్టార్ రెమ్యునరేషన్ పై డైరెక్తర్స్ అన్ కట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో చర్చించారు.

ఈ కార్యక్రమంలో కరణ్ జోహార్, జోయా అక్తర్, పా రంజిత్, వెట్రిమారన్ తో పాటుగా మహేష్ నారాయణన్ పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమ కుదుపునకు స్టార్ హీరోల పారితోషికం కూడా ఒక కారణమని అన్నారు వెట్రిమారన్. మార్కెట్ కు మించి స్టార్స్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారని కరణ్ జోహార్ అన్నారు. ఓటీటీలు కొన్ని సినిమాలకు భారీ ధర ఇచ్చి రైట్స్ కొంటున్నారు. రజినీకాంత్, విజయ్ లాంటి స్టార్ హీరోల సినిమాలు ఓటీటీలు 120 కోట్లు చెల్లిస్తారు. దాని వల్ల హీరోల పారితోషికాలు కూడా పెంచేస్తున్నారని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితి థియేట్రికల్ బాక్సాఫీస్ ఫెయిల్ అనడం కష్టమని.. ఓటీటీ సంస్థలు సృష్టించిన మాయాజాలమని వెట్రిమారన్ అన్నారు. కరోనా టైం నుంచి ఇది జరుగుతుందని అన్నారు. ఓటీటీలు ముందే భారీ ఆఫర్ చేయడం వల్ల నిర్మాతలు బడ్జెట్ పెంచేస్తున్నారు. హీరోలు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఐతే ఆ తర్వాత ఓటీటీలు పరిస్థితి గుర్తించి మేము అంత ఇవ్వలేమని చెబుతారు. అప్పటికే ప్రొడ్యూసర్ అనుకున్న బడ్జెట్ లో మూవీ తీస్తాడు. స్టార్స్ పారితోషికాలకు అగ్రిమెంట్ చేస్తాడు. ఆ టైం లో ఓటీటీలు వెనక్కి తగ్గితే నిర్మాత ఏం చేయాలని అన్నారు వెట్రిమారన్.

ఉదహరణగా మారి సెల్వరాజ్ చిన్న బడ్జెట్ తో సినిమాలు చేస్తూ రెండింతల లాభాం తెస్తున్నారు. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు థియేటర్ కు వచ్చి చూస్తారని అన్నారు. అంతేకాదు సినిమాలన్నీ థియేటర్ ని దృష్టిలో పెట్టుకునే తీయాలి. ఓటీటీ సంస్థలు కూడా సెన్సార్ షిప్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని అన్నారు. హాలీవుడ్ లో ఇప్పటికే ఈ పద్ధతి ఫాలో అవుతుంది. సినిమా క్వాలిటీ విషయంలో డైరెక్టర్ అనుకున్నది తీయాలంటే బడ్జెట్ కన్నా ఎక్కువే ఇస్తున్నారు. అందుకే నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మంచి వ్యూయర్ షిప్ ఉందని అన్నారు. ప్రతిభను ఎలా ఉపయోగించుకోవాలో వాళ్లు తెలుసుకున్నారని వెట్రిమారన్ అన్నారు.

ఇక ఇదే చర్చలో కరణ్ జోహార్ కూడా కిల్ మూవీ ని ఉదహరణగా చెబుతూ ఆ సినిమాకు అనుకున్న 40 కోట్లు అయితే కొందరు స్టార్స్ దానికి అంతే రెమ్యునరేషన్ కావాలని అడిగారు. 40 కోట్లు సినిమా, 40 కోట్లు పారితోషికం అంటే సినిమా 120 కోట్లు దాకా రాబట్టాలి అలా కలెక్ట్ చేతుందని మీరు గ్యారెంటీ ఇస్తారా అని అడిగాను.. వాళ్ల నుంచి ఆన్సర్ రాలేదు. అందుకే కొత్త నటీనటులను పెట్టి తీశానని అన్నారు కరణ్ జోహార్.

స్టార్ హీరోల రెమ్యునరేషన్ గురించి డైరెక్టర్స్ చర్చలు కొనసాగిస్తూనే ఉంటారు. ఐతే ఇక్కడ హీరోలని తక్కువ చేయడం కాదు కానీ సినిమా క్వాలిటీని పెంచేలా ఆ బడ్జెట్ ఏదో సినిమాకు పెట్టేలా చేయాలని వారి అభిప్రాయం.