Begin typing your search above and press return to search.

క్రేజీ కాంబో మూవీ క్రేజీ అప్‌డేట్‌

అయితే వెట్రిమారన్ ఇతర కమిట్‌మెంట్స్ మరియు సూర్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇంకా పట్టాలెక్కలేదు.

By:  Tupaki Desk   |   14 May 2024 2:30 AM GMT
క్రేజీ కాంబో మూవీ క్రేజీ అప్‌డేట్‌
X

తమిళ స్టార్‌ నటుడు సూర్య హీరోగా విలక్షణ దర్శకుడు వెట్రిమారన్‌ దర్శకత్వంలో వాడివాసల్‌ అనే సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా ను అధికారికంగా ప్రకటించారు. అయితే వెట్రిమారన్ ఇతర కమిట్‌మెంట్స్ మరియు సూర్య ఇతర సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఇంకా పట్టాలెక్కలేదు.

గత కొంత కాలంగా ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటూ ఉంది. వెట్రిమారన్ తన హిట్‌ మూవీ 'విడుతలై' సీక్వెల్‌ ను రూపొందించే పనిలో ఉన్న విషయం తెల్సిందే. విడుతలై 2 సినిమా విడుదలైన తర్వాత సూర్య తో వాడి వాసల్‌ సినిమా షూటింగ్‌ ప్రారంభం అవ్వబోతుంది.

తాజాగా దర్శకుడు వెట్రిమారన్ మీడియాతో మాట్లాడుతూ... విడుతలై 2 సినిమా ఇంకా 20 రోజుల షూటింగ్ మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తయిన తర్వాత సూర్య తో తన సినిమా వాడి వాసల్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా పేర్కొన్నాడు.

వాడి వాసల్‌ సినిమాను మరో మూడు నెలల్లో పట్టాలెక్కిస్తాను అన్నాడు. ఈ లోపు సూర్య నటిస్తున్న సినిమాలకు సంబంధించిన వర్క్ కూడా పూర్తి అవ్వబోతుంది. పల్లెటూరు యాక్షన్ డ్రామాగా వాడివాసల్‌ ఉంటుంది అంటూ ఇప్పటికే దర్శకుడు ప్రకటించాడు. జీవి ప్రకాష్ సంగీతం అందించబోతున్న ఈ సినిమాలో ఆండ్రియా జెర్మియా హీరోయిన్ గా నటించబోతోంది.