Begin typing your search above and press return to search.

ఒక్క ఫోటోతో తంబీలకి పిచ్చెక్కించాడు

తాజాగా వెట్రిమారన్‌ మరియు విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు అమీర్‌ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

By:  Tupaki Desk   |   29 Nov 2023 2:45 AM GMT
ఒక్క ఫోటోతో తంబీలకి పిచ్చెక్కించాడు
X

తమిళ్‌ తో పాటు సౌత్‌ ఇండియన్ సినీ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు ప్రేక్షకులు ఎంతో అభిమానించే దర్శకుడు వెట్రిమారన్‌ అనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకు ఆయన నుంచి వచ్చిన ప్రతి ఒక్క సినిమా మినిమం ఆడింది. విభిన్న కథాంశాలను తీసుకుని, ఆ కథలను వెట్రిమారన్‌ చూపించే విధానంకు అంతా ఫిదా అవుతూనే ఉంటారు.

ఆ మధ్య విడుదలై సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సర్‌ప్రైజ్ చేసిన వెట్రిమారన్ ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసిన విడుదలై పార్ట్‌ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. విడుదలై పార్ట్‌ 2 సినిమా రిలీజ్ పనులతో పాటు సూర్య తో రూపొందించబోతున్న 'వాడివాసల్‌' సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ ని కూడా చేస్తున్న విషయం తెల్సిందే.

తాజాగా వెట్రిమారన్‌ మరియు విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్న దర్శకుడు అమీర్‌ కలిసి ఉన్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అమీర్ కు వెట్రిమారన్‌ కథ వినిపిస్తున్నట్లుగా ఆ ఫోటో లోని ఫోజ్ ని చూస్తూ ఉంటే అనిపిస్తోందని తమిళ తంబీలు మాట్లాడుకుంటూ ఉన్నారు.

వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన వడ చెన్నై ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో తమిళ తంబీలకు తెలుసు. అందుకే వారు ఈ ఫోటోను చూసి మరోసారి వడ చెన్నై కాంబో అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆ సినిమా రేంజ్ లో మరో సినిమా ఉంటుందని వారు నమ్మకంగా మాట్లాడుకుంటున్నారు.

సూర్య తో వెట్రిమారన్‌ రూపొందించబోతున్న వాడివాసల్‌ సినిమా కోసం అమీర్ తో చర్చలు జరుపుతున్నాడు అంటూ తమిళ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరిద్దరి ఫోటో ని చూసి తమిళ తంబీలు పిచ్చెక్కిపోతున్నారు. ఇద్దరూ ఇద్దరే అన్నట్లుగా వీరి కాంబో మూవీ ఉంటుంది. సూర్య ఫ్యాన్స్ తో పాటు తమిళ సినీ ప్రేక్షకులు అంతా కూడా వాడివాసల్‌ ను ఎంజాయ్‌ చేయడం ఖాయం అంటూ టాక్‌ మొదలైంది.