Begin typing your search above and press return to search.

వేట్టయన్ బాక్సాఫీస్ రికార్డ్.. టాప్ 4లోనే..

కాబట్టి బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ముందే చెప్పడానికి వీలు లేదు.

By:  Tupaki Desk   |   11 Oct 2024 6:28 AM GMT
వేట్టయన్ బాక్సాఫీస్ రికార్డ్.. టాప్ 4లోనే..
X

సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ మూవీతో అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కథ బాగున్నా కూడా దానిని చెప్పే విధానంలో దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ కొంత తడబడ్డారని అంటున్నారు. అయితే ఓ వర్గం సూపర్ స్టార్ అభిమానులు మాత్రం సినిమా కొత్తగా ఉందనేలా కామెంట్ చేస్తున్నారు. కాబట్టి బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉంటుందనేది ముందే చెప్పడానికి వీలు లేదు.

ఈ దసరా హాలిడేస్ లో ‘వేట్టయన్’ కి పోటీ ఇచ్చే రేంజ్ సినిమా కోలీవుడ్ లో పడలేదు. దీంతో కచ్చితంగా ఈ మూవీ మంచి వసూళ్లు అందుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ‘వేట్టయన్’ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 75 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఉంటుందని అంచనా వేశారు. అయితే ఈ సినిమా థియేటర్స్ ఆక్యుపెన్సీ పరంగా చూసుకుంటే 60 నుంచి 65 కోట్ల వరకు వసూళ్లు అయ్యి ఉండొచ్చని అంటున్నారు.

తమిళనాడులో ‘వేట్టయన్’ మూవీ థియేటర్స్ ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉంది. నార్త్ ఇండియాలో తక్కువగా ఉంది. యూఎస్ లో 3 మిలియన్ డాలర్స్ వరకు ఈ చిత్రం వసూళ్లు చేసి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలో 9 నుంచి 10 కోట్ల మధ్యలో కలెక్షన్స్ ఉంటాయని, కేరళలో 3 కోట్ల వరకు వసూళ్లు చేసి ఉంటుందని, నార్త్ అమెరికాలో కోటి రూపాయిల వరకు కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ పండితులు లెక్కలు వేస్తున్నారు.

భారీ అంచనాల మధ్యలో రిలీజ్ అయిన కూడా ఆశించిన స్థాయిలో థియేటర్స్ ఆక్యుపెన్సీ నమోదు కాలేదని అంటున్నారు. ట్రైలర్ కూడా పెద్దగా జనాలకి రీచ్ కాకపోవడంతో ఈ ఇంపాక్ట్ కలెక్షన్స్ పై పడిందని ట్రేడ్ పండితులు లెక్కలు చెబుతున్నారు. అయితే రజినీకాంత్ కెరియర్ లో ఫస్ట్ డే కలెక్షన్స్ పరంగా ‘వేట్టయన్’ నాలుగో స్థానంలో ఉందని తెలుస్తోంది.

దీనికంటే ముందుగా ‘2.ఓ’, ‘కబాలి’, ‘జైలర్’ సినిమాలు ఉన్నాయి. రజినీకాంత్ కెరియర్ లో అత్యధిక కలెక్షన్స్ అందుకున్న చిత్రంగా ‘2.ఓ’ ఉంది. ఈ మూవీ కలెక్షన్స్ రికార్డ్ ని ఇప్పటి కోలీవుడ్ లో ఎవ్వరు బ్రేక్ చేయలేదు. ‘జైలర్’ మూవీ 600 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఇప్పుడు వచ్చిన ‘వేట్టయన్’ మూవీకి మిశ్రమ స్పందనలు వచ్చిన నేపథ్యంలో లాంగ్ రన్ లో 500 కోట్ల కలెక్షన్స్ ని రీచ్ కాకపోవచ్చని అంటున్నారు. ‘వేట్టయన్’ చిత్రంలో అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి కీలక పాత్రలలో నటించారు.