Begin typing your search above and press return to search.

అప్పుడు హుకుం.. ఇప్పుడు హంటర్..!

స్టార్ సినిమాలకు కథ కథనాలతో పాటు మ్యూజిక్ కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది.

By:  Tupaki Desk   |   20 Sep 2024 9:31 AM GMT
అప్పుడు హుకుం.. ఇప్పుడు హంటర్..!
X

స్టార్ సినిమాలకు కథ కథనాలతో పాటు మ్యూజిక్ కూడా ఎంత ఇంపార్టెంట్ అన్నది కొన్ని సినిమాలను చూస్తే అర్థమవుతుంది. దర్శకుడు చెప్పాలనుకున్న కథాంశం కు తమ మ్యూజిక్ తో కూడా సపోర్ట్ అందిస్తారు. అందుకే సంగీతం పరంగా కొన్ని సినిమాలు నెక్స్ట్ లెవెల్ లో నిలుస్తాయి. అలాంటి వీర లెవెల్ మ్యూజిక్ తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్నాడు తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుద్. అతను మ్యూజిక్ అందిస్తున్నాడు అంటే సినిమా నెక్స్ట్ లెవెల్ అనే రేంజ్ కి వెళ్లాడు.

ఇక సూపర్ స్టార్ రజిని సినిమాకు అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నాడంటే మాత్రమే ఆ లెక్క వేరేలా ఉంటుంది. రజిని జైలర్ సినిమాకు అనిరుద్ అందించిన మ్యూజిక్ ఎంత బ్లాక్ బస్టర్ అయ్యిందో తెలిసిందే. అందుకే ప్రస్తుతం రజిని చేస్తున్న వేటయ్యన్ కు కూడా అనిరుద్ ని రిపీట్ చేస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ఒక సాంగ్ సూపర్ హిట్ కాగా లేటెస్ట్ గా వేటయ్యన్ నుంచి హంటర్ సాంగ్ రిలీజైంది.

జైలర్ సినిమాలో హుకుం తరహాలో వేటయ్యన్ లో ఈ హంటర్ సాంగ్ కంపోజ్ చేశాడు అనిరుద్. సూపర్ స్టార్ మీద తనకున్న ప్రేమ అభిమానం అంతా కూడా ఈ సాంగ్ లో చూపించాడు అనిరుద్. తప్పకుండా జైలర్ ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు అనిపిస్తున్నా వేటయ్యన్ కూడా సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు సూపర్ ట్రీట్ అందించేలా ఉందని చెప్పొచ్చు. జై భీమ్ సినిమాతో ప్రశంసలు అందుకున్న టీ జే జ్ఞానవేల్ డైరెక్ట్ చేస్తున్న వేటయ్యన్ సినిమా అక్టోబర్ 10న రిలీజ్ అవుతుంది.

జైలర్ ముందు వరకు రజిని పెద్దగా ఫాం లో లేడు. కానీ జైలర్ తో తన మాస్ స్టామినా మరోసారి చూపించాడు. ఐతే టీ జే జానవెల్ వేటయ్యన్ లో రజిని ని కేవలం మాస్ యాంగిల్ మాత్రమే కాదు కొత్తగా చూపించనున్నారని తెలుస్తుంది. దసరా కానుకగా తమిళం తో పాటుగా తెలుగు ఆడియన్స్ ముందుకు వేటయ్యన్ వస్తుంది. జైలర్ సినిమా తెలుగులో కూడా బాగానే ఆడింది. అందుకే రజిని వేటయ్యన్ కు తెలుగు బిజినెస్ కూడా బాగుందని టాక్. మొత్తానికి వేటయ్యన్ కు అనిరుద్ తన మ్యూజిక్ తో సూపర్ బూస్ట్ ఇస్తున్నాడు. మరి ఈ సినిమా కూడా జైలర్ తరహాలో బ్లాక్ బస్టర్ అందుకుంటుందా లేదా అన్నది రిలీజ్ అయితే తెలుస్తుంది.