Begin typing your search above and press return to search.

వేట్టయన్.. అదే పెద్ద మైనేస్..

అయితే రజినీకాంత్ ఇమేజ్ ఈ సినిమాకి మైనస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   12 Oct 2024 7:30 AM GMT
వేట్టయన్.. అదే పెద్ద మైనేస్..
X

సినిమాలలో కొన్ని సన్నివేశాలు చూసినపుడు ఆడియన్స్ వాటిలో ఉన్న ఎమోషన్స్ కి స్ట్రాంగ్ గా కనెక్ట్ అవుతారు. అయితే ఆ సీక్వెన్స్ ఏమైనా ఇబ్బందికరంగా అనిపిస్తే డిస్ కనెక్ట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అలాంటి సీక్వెన్స్ ఒక్కోసారి మూవీ ఫలితం మీద ప్రభావం చూపిస్తాయి. ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ ‘వేట్టయన్’ విషయంలో కూడా ఆడియన్స్ ఓ సన్నివేశంపై ఎక్కువగా కంప్లైంట్ చేస్తున్నారు.

అక్టోబర్ 10న రిలీజ్ అయిన ఈ సినిమాకి మిశ్రమ రివ్యూలు వచ్చాయి. అలాగే పబ్లిక్ నుంచి కూడా యావరేజ్ టాక్ వచ్చింది. కంటెంట్ బాగున్న కూడా దానిని కమర్షియల్ గా చెప్పే ప్రయత్నంలో దర్శకుడు టీజే జ్ఞాన్ వేల్ తడబడ్డాడని అంటున్నారు. ‘జై భీమ్’ లాంటి సోషల్ కాన్సెప్ట్ మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడిగా టీజే జ్ఞాన్ వేల్ కి మంచి పేరుంది. ‘వేట్టయన్’ లో కూడా అలాంటి ఇంటరెస్టింగ్ సోషల్ ఎలిమెంట్ ని తీసుకున్నారు. అయితే రజినీకాంత్ ఇమేజ్ ఈ సినిమాకి మైనస్ అయ్యిందనే మాట వినిపిస్తోంది.

ఆయనని దృష్టిలో ఉంచుకొని అవసరం లేని ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్స్ ని కథలో భాగంగా యాడ్ చేశారు. ఇవి మెయిన్ స్టొరీకి అడ్డంకిగా మారాయని అంటున్నారు. అలాగే ఈ చిత్రంలో దుషారా విజయ్ ఓ కీలక పాత్రలో నటించింది. అత్యాచారం చేసే సీక్వెన్స్ క్లోజ్ అప్ షాట్స్ లో చూపించారు. అత్యాచారానికి గురయ్యే బాధితురాలి వేదనని ఆడియన్స్ కి కనెక్ట్ చేయాలని ఆ సీన్ ని జ్ఞాన్ వేల్ డిజైన్ చేశారంట.

అయితే ఈ సీక్వెన్స్ ఫ్యామిలీతో కలిసి మూవీ చూసేవారికి కాస్తా ఇబ్బందికరంగా అనిపించిందంట. సినిమాలో ఈ సీన్ లో ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవ్వలేదు సరికదా విమర్శిస్తున్నారు. A రేటెడ్ మూవీస్ లో మాత్రమే ఇలాంటి సన్నివేశాలు పెట్టాలని, యూ/ఏ సర్టిఫికేట్ ఉన్న వాటిలో ఇబ్బందికర సీక్వెన్స్ కి కత్తెర వేయాలని అంటున్నారు. ఈ సీక్వెన్స్ వలన మూవీకి వచ్చిన అదనపు అడ్వాంటేజ్ ఏమీ లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ఆడియన్స్ కోరుకునే ఎలిమెంట్స్ చిత్రంలో చెప్పుకోదగ్గ విధంగా లేవని అంటున్నారు. ఓవరాల్ గా పరవాలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ స్టార్ రజినీకాంత్ లాంటి యాక్టర్ తో సినిమా చేసే అవకాశం వచ్చినపుడు స్క్రిప్ట్ పైన మరింతగా వర్క్ చేసి ఉంటే బాగుండేదని సినీ విశ్లేషకులు అంటున్నారు. సోలో రిలీజ్ అవకాశం వచ్చిన కూడా ‘వేట్టయన్’ మూవీ ప్రేక్షకులని పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయిందనే టాక్ వస్తోంది.