వేట్టయన్.. జైలర్ రేంజ్ లో లేదు కానీ..
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట్టయన్’ మూవీ ఇటీవల థియేటర్స్ లోకి వచ్చింది.
By: Tupaki Desk | 11 Oct 2024 5:06 AM GMTసూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేట్టయన్’ మూవీ ఇటీవల థియేటర్స్ లోకి వచ్చింది. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ఫాహాద్ ఫాజిల్, రానా దగ్గుబాటి లాంటి స్టార్ యాక్టర్స్ ఉన్నారు. ‘జై భీమ్’ సినిమాతో దర్శకుడిగా నేషనల్ అవార్డు అందుకున్న టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వచ్చిన మూవీ కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ నుంచి వచ్చిన సాంగ్ కూడా సూపర్ హిట్ అయ్యింది.
అనిరుద్ రవిచందర్ మ్యూజిక్ అందించడంతో సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెరిగిపోయాయి. కోలీవుడ్ లో ఈ సినిమాకి మంచి ఆదరణ వస్తోంది. రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘జైలర్’ మూవీతో ఈ చిత్రాన్ని కొంతమంది పోలుస్తున్నారు. అయితే తెలుగునాట మాత్రం ‘వేట్టయన్’ మూవీకి ఆ స్థాయి పబ్లిక్ టాక్ రాలేదు. ‘జైలర్’ మూవీ ప్యూర్ కమర్షియల్ మూవీ. అలాగే రజినీకాంత్ క్యారెక్టర్ ఎలివేషన్స్, నెల్సన్ దిలీప్ కుమార్ ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా వర్క్ అవుట్ అయ్యాయి.
వాటికి అనిరుద్ రవిచందర్ అందించిన మ్యూజిక్ మరింత ప్లస్ అయ్యింది. అన్ని అంశాలు ‘జైలర్’ సినిమాని టాప్ లో నిలబెట్టాయి. అయితే ‘వేట్టయన్’ మూవీ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఈ సినిమాలో టీజే జ్ఞాన్ వేల్ ఒక సోషల్ ఎలిమెంట్ ని చెప్పాలని అనుకున్నాడు. దానిని ప్రెజెంట్ చేసే క్రమంలో రజినీకాంత్ ఇమేజ్, మార్కెట్ లెక్కలని దృష్టిలో ఉంచుకొని ఫైట్స్, సాంగ్స్ పెట్టాడు.
వీటి కారణం చెప్పాలనుకున్న పాయింట్ ని అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ చేయలేకపోయాడనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా సెకెండాఫ్ లో డైరెక్టర్ భాగా తడబడ్డాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. ‘జై భీమ్’ తరహాలో మంచి పాయింట్ తీసుకొని వాటిని కమర్షియల్ కోణంలో చెప్పాలని చేసిన ప్రయత్నం కొంత మైనస్ అయ్యిందని పబ్లిక్ నుంచి వస్తోన్న స్పందన. రానా ఎంట్రీ తర్వాత కథ టామ్ అండ్ జెర్రి గేమ్ తరహాలో సాగుతుందంట. అయితే అది ఎక్స్ పెక్ట్ చేసే విధంగానే ఉందని అంటున్నారు.
కాకపోతే ఎక్కడా బోర్ కొట్టకుండా కథని నేరేట్ చేయడం ‘వేట్టయన్’ కి కొంత అడ్వాంటేజ్ అయ్యిందని చెబుతున్నారు. ఓవరాల్ గా ‘జైలర్’ రేంజ్ మూవీ కాకపోయిన కూడా రజినీకాంత్ ఫ్యాన్స్ మాత్రం ఎంజాయ్ చేసే రేంజ్ లోనే మూవీ ఉందంట. సోలో రిలీజ్ కావడంతో సినిమాకి మంచి భారీ ఓపెనింగ్స్ వచ్చాయనే మాట వినిపిస్తోంది. ఈ దసరా రేసులో ‘వేట్టయన్’ కి పోటీ ఇచ్చే పెద్ద సినిమాలు లేకపోవడంతో కోలీవుడ్ లో కమర్షియల్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తెలుగులో ఏ మాత్రం వసూళ్ళని అందుకుంటుందనేది కాలమే సమాధానం ఇవ్వాలి.