వెయ్ దరువెయ్ సినిమా ఎలా ఉంది ?
వెయ్ దరువెయ్ సినిమా మాస్ గా ట్రై చేశాడు. అయితే అసలేమాత్రం మార్కెట్ లేని సాయిరాం శంకర్ మీద ఇలాంటి అటెంప్ట్ చేయడం ప్రయోగమే అని చెప్పాలి
By: Tupaki Desk | 17 March 2024 8:45 AM GMTప్రస్తుతం ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే అందులో కంటెంట్ కొత్తగా అయినా అయ్యి ఉండాలి లేదా వెరైటీ ప్రమోషన్స్ చేసి ఆడియన్స్ ఎట్రాక్ట్ చేస్తే కానీ సినిమాల గురించి ఆడియన్స్ పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ప్రమోషన్స్ బాగా చేసి థియేటర్ కి ఆడియన్స్ వచ్చేలా చేసినా అందులో కంటెంట్ రొటీన్ గా ఉంటే మాత్రం ఆడియన్స్ పెదవి విరిచేస్తారు. ప్రతి వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో ఇలా ఏదో ఒకటి ఉంటుంది. ఈ వారం రిలీజైన సినిమాల్లో అలా పూరీ జగన్నాథ్ తమ్ముడు చేసిన వెయ్ దరువెయ్ వచ్చింది.
పూరీ మంచి ఫాం లో ఉన్నప్పుడే తమ్ముడిని హీరోగా నిలబెట్టాలని రెండు మూడు ప్రయత్నాలు చేశాడు కానీ అవేవి వర్క్ అవుట్ అవ్వలేదు. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ వెయ్ దరువెయ్ సినిమాతో వచ్చాడు సాయి రాం శంకర్. ఈ వారం 9 సినిమాల మధ్య వెయ్ దరువెయ్ సినిమా వచ్చింది. నవీన్ రెడ్డి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది.
వెయ్ దరువెయ్ కథ సంగతి చూస్తే.. కామారెడ్డిలో పని పాటా లేకుండా తిరిగే హీరో శంకర్ (సాయిరాం శంకర్) ఊళ్లో వాళ్ల మాటలు పడలేక జాబ్ కోసం హైదరాబాద్ వస్తాడు. తను చదివిన చదువుకి జాబ్ దొరకడం కష్టమని ఫ్రెండ్ సజెషన్ తో ఫేక్ సర్టిఫికెట్ తీసుకోవాలని అనుకుంటాడు. ఆ కంపెనీలో పనిచేసే శృతి (యశ శివకుమార్)ని చూసి ఇష్టపడతాడు. ఆ సంస్థ ఓనర్ తమ్ముడు భాను ప్రసాద్ (సునీల్) కు అన్నతో ఆస్తి గొడవల వల్ల ఇద్దరి మధ్య ఫైట్ జరుగుతుంది. ఇంతకీ అసలు శంకర్ అక్కడికి ఎందుకు వచ్చాడు.. అక్కడ మాఫియా గుట్టుని ఎలా బయట పెట్టాడు అన్నది వెయ్ దరువెయ్ స్టోరీ.
ఈ సినిమా చూస్తే నిఖిల్ చేసిన అర్జున్ సురవరం సినిమా గుర్తుకొస్తుంది. అయితే అది కంప్లీట్ గా ఫేక్ సర్టిఫికెట్స్ మీద నడిపించాడు. వెయ్ దరువెయ్ సినిమా మాస్ గా ట్రై చేశాడు. అయితే అసలేమాత్రం మార్కెట్ లేని సాయిరాం శంకర్ మీద ఇలాంటి అటెంప్ట్ చేయడం ప్రయోగమే అని చెప్పాలి. రొటీన్ మాస్ ఎంటర్టైనర్ చేయడం రిస్కే అయినా ఆడియన్స్ ని మెప్పించడంలో విఫలమైంది. కొత్త కథలు.. సరికొత్త ప్రయోగాలు చేస్తున్న ఈ టైం లో ఇంకా భారీ అనవసరమైన ఎలివేషన్స్, భారీ బిల్డప్పులు ఇస్తే చూసే పరిస్థితి లేదని ఈ దర్శకుడు అర్థం చేసుకోలేకపోయాడు.