మరో సీనియర్ హీరోతో బైరావకోన డైరెక్టర్
ఊరు పేరు భైరవకోన సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్.
By: Tupaki Desk | 21 March 2024 4:52 AM GMTఊరు పేరు భైరవకోన సినిమాతో తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చిన టాలెంటెడ్ డైరెక్టర్ విఐ ఆనంద్. మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన విఐ ఆనంద్ హృదయం ఎక్కడున్నది సినిమాతో దర్శకుడిగా టర్న్ అయ్యాడు. తరువాత తమిళంలో ఓ మూవీ చేశాడు. సందీప్ కిషన్ హీరోగా చేసిన టైగర్ సినిమా అతనికి డైరెక్టర్ గా గుర్తింపు తీసుకొచ్చింది.
తరువాత నిఖిల్ ఎక్కడికి పోతావు చిన్నవాడా మూవీ కమర్షియల్ సక్సెస్ ని అందించింది. నెక్స్ట్ ఒక్క క్షణంతో మంచి ప్రయోగమే చేసినప్పటికీ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రవితేజతో డిస్కో రాజా కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. ఇక విఐ ఆనంద్ ఇటీవల భైరవకోన మూవీతో కాస్త గాడిలో పడ్డాడు. ఆ సినిమా కథలో కూడా ఇంకాస్త జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఫలితం మరోలా ఉండేదనే కామెంట్స్ వచ్చాయి. కానీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పరవాలేదు అనిపించింది.
ఇక ఫాంటసీ ఫిక్షనల్ కథలని చెప్పడంలో విఐ ఆనంద్ దిట్ట. వాటితోనే తనదైన మార్క్ చూపించాడు. భైరవకోన సినిమాలో కూడా డిఫరెంట్ ఎలిమెంట్ ఆవిష్కరించాడు. ఇప్పుడు మరో సీనియర్ హీరో కోసం ఓ ఫిక్షనల్ స్టోరీని విఐ ఆనంద్ సిద్ధం చేసే పనిలో ఉన్నారంట. అసలు కథ గురించి ఇప్పటికే పూర్తి చేసిన ఈ దర్శకుడు కొంతమంది హీరోలను కూడా కలిశాడు.
అయితే అతనికి మాత్రం ఒక సీనియర్ హీరో నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ సీనియర్ నటుడు మరెవరో కాదు. విక్టరీ వెంకటేష్ అని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో స్క్రిప్ట్ కంప్లీట్ చేసిన అనంతరం మరోసారి నేరేట్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వెంకటేష్ కూడా ఎప్పటికప్పుడు కొత్తకథలతో ప్రయోగాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటాడు.
మరి విఐ ఆనంద్ కి అవకాశం ఇచ్చి ఫాంటసీ బేస్డ్ కథని చేసే అవకాశం ఉందా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వెంకటేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ కామెడీ కమర్షియల్ ఎంటర్టైనర్ చేయబోతున్నాడు. త్వరలో ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. దీని తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్ లో ఉన్నాయి.
అవన్నీ కంప్లీట్ అయ్యాక విఐ ఆనంద్ కథపై దృష్టి పెట్టే అవకాశం ఉందనేది టాలీవుడ్ లో టాక్. ఈ ఏడాది సైంధవ్ సినిమాతో వెంకటేష్ ప్రేక్షకుల ముందుకి వచ్చారు. శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. వరుసగా ఎఫ్2, ఎఫ్3, నారప్ప, దృశ్యం సినిమాలతో మెప్పించిన వెంకీకి సైంధవ్ బిగ్ షాక్ ఇచ్చింది. మరి తదుపరి సినిమాలు ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాయో చూడాలి.