ఫ్యామిలీతో కాదు సింగిల్ గా చూడాల్సిన సినిమా!
ఓటీటీకి సెన్సార్ లేదు అక్కడ ఎలాగైనా సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సన్నివేశాలైనా ఎంచక్కా ఆస్వాదించొచ్చు.
By: Tupaki Desk | 16 Oct 2024 1:30 PM GMTఓటీటీకి సెన్సార్ లేదు. అక్కడ ఎలాగైనా సినిమాని రిలీజ్ చేసుకోవచ్చు. ఎలాంటి సన్నివేశాలైనా ఎంచక్కా ఆస్వాదించొచ్చు. ఎలాంటి హింసనైనా ఓటీటీ ఆడియన్స్ స్వాగతించాల్సిందే. ఆరకంగా మైండ్ ఫిక్స్ చేసుకుని కొన్ని సినిమాలు ఓటీటీ ఆడియన్స్ చూడాల్సి ఉంటుంది. సంచలనాల రాంగోల్ వర్మ అందుకే ఓటీటీని ది బెస్ట్ ఆప్షన్ చూసుకుని అప్పుడప్పుడు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తుంటాడు.
ఓటీటీకి కూడా సెన్సార్ షిప్ తీసుకురావాలని కంగన రనౌత్ లాంటి వారు డిమాండ్ చేస్తుంటారు. ఇది వేరే సంగతి అనుకోండి. తాజాగా ఓ బోల్డ్ మూవీ ఇప్పుడు ఓటీటీని ఊపేస్తోంది. అదే `విక్కీ క్రిస్టినా బార్సిలోనా`. కామెడీ..రొమాన్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన చిత్రమిది. బోల్డ్ కాన్సెప్ట్ లో మాంచి కిక్కిచ్చే ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది. ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అయిన అమ్మాయిలు.. ఒకే అబ్బాయిని ప్రేమిస్తారు. ఆ అబ్బాయి వీరిని ఫ్లర్టీ, ఫ్లర్టీ మాటలతో పడేస్తాడు.
ఆ తర్వాత ముగ్గురు కలిసి లివ్ ఇన్ రిలేషన్ మొదలు పెడతారు. కొన్ని రోజులకు ముగ్గురి మధ్య మనస్పర్దలొస్తాయి. ఎంతగా అంటే ఒకర్ని ఒకరు చంపుకునేంతగా. సరిగ్గా ఇదే సమయంలో ఆ ఇద్దరి అమ్మాయిలకి ఓ నిజం తెలుస్తుంది. తమకంటే ముందే మరో అమ్మాయితో రిలేషన్ లో ఉన్నాడని తెలుసు కుంటారు. దీంతో వాళ్లిద్దరు మోసం పోయామని గ్రహిస్తారు. అప్పుడే మూడవ అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది.
ఈ ముగ్గురు కలిసి ఆ అబ్బాయిపై ఎలా పగ తీర్చుకున్నారు? అన్నది బుల్లి తెరపైనే చూడాలి. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. కానీ సినిమా చూసే ముందు చుట్టూ ఎవరూ లేకుండా చూసుకోండి సుమీ.