ఆ హీరోకి తిప్పలు ఇప్పట్లో తప్పేలా లేవు!
ఇటీవల రిలీజ్ అయిన `ఛావా` ట్రైలర్ లో విక్కీ కౌశల్ (శంభాజీ మహారాజ్) లెజీమ్ డాన్స్ చేయడం వివాదా స్పందంగా మారిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 29 Jan 2025 9:30 AMఇటీవల రిలీజ్ అయిన `ఛావా` ట్రైలర్ లో విక్కీ కౌశల్ (శంభాజీ మహారాజ్) లెజీమ్ డాన్స్ చేయడం వివాదా స్పందంగా మారిన సంగతి తెలిసిందే. మహరాష్ట్ర ప్రభుత్వమే ఈ డాన్సుపై సీరియస్ అయింది. సినిమా వివాదా స్పదం అయ్యే అవకాశం ఉందని..అలాంటి సన్నివేశాలతోనే సినిమా తీసారని తాము అనుమతి ఇవ్వనిదే సినిమా రిలీజ్ చేయడానికి వీల్లేదంటూ హెచ్చరించింది. చరిత్ర తెలిసిన వారికి...స్కాలర్స్ కు సినిమా చూపించి వాళ్ల అనుమతి పొందిన తర్వాతే రిలీజ్ చేయాలని అల్టిమేటం జారీ అయింది. రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాశంగా మారింది.
ఆ డాన్స్ పై నిరసనలు, చర్చలు కూడా జరిగాయి. తుదిగా ఆ నృత్యాన్ని సినిమా నుంచి తొలగించాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారు. దీంతో ఆ వివాదానికి పుల్ స్టాప్ పడినట్లే. ఫిబ్రవరి 14న సినిమా రిలీజ్ అవుతుంది. ఈలోపు `ఛావా` మహరాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ తెచ్చుకోవాలి. అలాగే సెన్సార్ అభ్యంతరాలు వ్యక్తం చేస్తే కట్టుబడి వ్యవహరించాలి. ఎలాంటి వివాదం , అభ్యంతరాలు లేకుండా సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలి. అయితే ఈ వివాదం విక్కీ కౌశల్ ని `ఛావా`తో వదిలేదు కాదు.
ఆయన హీరోగా మరో మరో పీరియాడికల్ డ్రామా `మహావ తార్`లోపూ కనిపిస్తాడు. ఇందులో విక్కీ కౌశల్ పరశురాముడి పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రం విక్కీ కెరీర్ లోనే గొప్ప చిత్రంగా నిలిచిపోతుందనే అంచనాలున్నాయి. ఇంతవరకూ ఏ నటుడు ఇలాంటి పాత్ర పోషించలేదు. వీలైనంత రియలిస్టిక్ గాన ఈ కథను ప్రేక్షకుల ముందు ఉంచుతామని ఇప్పటికే దర్శక, నిర్మాతలు ప్రకటించారు. చిత్ర రచయిత నిరేన్ భట్ ఇటీవల ఓ ఇంట్రెస్టింగ్ ప్రకటన కూడా చేసారు.
భాగవత పురాణం , ఇతర 11 గ్రంథాల నుండి ఈ కథను సిద్దం చేసినట్లు తెలిపారు. అలాగే ఎలాంటి వివాదాలకు తావు లేకుండానే సిద్దం చేసినట్లు ధీమా వ్యక్తం చేసారు. భాగవత పురాణం..ఇతర 11 గ్రంధాలను బాగా అధ్యయనం చేసిన తర్వాత స్టోరీ రాసినట్లు తెలిపారు. ఈ పీరియాడికల్ డ్రామా లో విష్ణువు యొక్క 6వ అవతారంగా పరిగణిం చబడే పరశురాముడి కథను చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. చారిత్రాత్మక నేపథ్యం గల కథల విషయంలో ముందుగా ఎలాంటి వివరణలు ఇచ్చినా? రిలీజ్ వరకూ వివాదాలతో అంటగాగడం తప్పదు.