పుష్ప చావు దెబ్బ నుంచి ఆ బాలీవుడ్ హీరో సేఫ్..!
రాబోయే రెండు మూడు ఏళ్లలో హిందీ నుంచి రాబోతున్న సినిమాలు పుష్ప 2 రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
By: Tupaki Desk | 7 Dec 2024 4:30 PM GMTప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 సినిమా సంచలన వసూళ్లు నమోదు చేసింది, చేస్తూనే ఉంది. మొదటి రోజు దాదాపుగా రూ.300 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా స్వయంగా చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించడం జరిగింది. బాలీవుడ్ సినిమాల హీరోలకు సైతం సాధ్యం కానీ హిందీ వసూళ్లను పుష్ప 2 సినిమా దక్కించుకుంది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ జవాన్ పేరుతో ఉన్న అత్యధిక మొదటి రోజు వసూళ్లను బ్రేక్ చేయడం మాత్రమే కాకుండా ఏకంగా రూ.7 కోట్ల లీడ్‌ను పుష్ప 2 దక్కించుకోవడం జరిగింది. రాబోయే రెండు మూడు ఏళ్లలో హిందీ నుంచి రాబోతున్న సినిమాలు పుష్ప 2 రికార్డ్‌ను బ్రేక్ చేసే అవకాశాలు కనిపించడం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో, సౌత్ రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ రాష్ట్రాల్లో పుష్ప 2 సాధిస్తున్న వసూళ్లు చూసి ప్రతి ఒక్కరు నోరు వెళ్లబెడుతున్నారు. ఏ భాషలోనూ పుష్ప 2 సినిమాకు పోటీగా సినిమాలు రాలేదు. ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు, క్రేజ్ ఉన్న సినిమాలు ఏ ఒక్కటి విడుదల కాలేదు. ఒక వేళ విడుదల అయ్యి ఉంటే పుష్ప 2 కి పెద్దగా వచ్చే నష్టం ఏమీ లేదు. కానీ పుష్ప 2 కి పోటీగా వచ్చిన సినిమాకు పెద్ద డ్యామేజ్ అయ్యి ఉండేది. ఆ పెద్ద డ్యామేజీ నుంచి హిందీ మూవీ 'ఛావా' తప్పించుకుంది అంటూ బాలీవుడ్ వర్గా వారు, హిందీ మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.
విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన చావా సినిమాను డిసెంబర్ 6న ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ముందుగానే భావించారు. అందుకోసం ఏర్పాట్లు చేశారు. కానీ తీరా పుష్ప 2 సినిమా క్రేజ్ చూసి బాబోయ్ ఇది వర్కౌట్ అవ్వాలంటే కాస్త ఆగాల్సిందే అని ఛావా నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఆ విషయంలో వారు తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుబట్టినా అప్పుడు వారు తీసుకున్న నిర్ణయం సరైనదే అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ ఛావా ఇప్పటికే పుష్ప 2 కి పోటీగా వచ్చి ఉంటే కచ్చితంగా చావు దెబ్బ తినేది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప 2 ను మైత్రి మూవీ మేకర్స్ వారు దాదాపుగా రూ.400 కోట్ల బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఈ సినిమా ద్వారా అల్లు అర్జున్ రూ.300 కోట్ల పారితోషికం తీసుకున్నారని, సుకుమార్ రూ.150 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. రష్మిక రూ.10 కోట్ల పారితోషికం అందుకోగా శ్రీలీల ఈ సినిమాలో ఐటెం సాంగ్ చేసినందుకు గాను రూ.2 కోట్ల పారితోషికంను తీసుకున్నారట. మొత్తానికి ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఈ సినిమా వల్ల వాయిదా పడ్డ సినిమాలు సేఫ్ అన్నట్లుగా టాక్ వినిపిస్తోంది. మరో వారం రోజులు ఆగి ఏదైనా సినిమా వస్తే బాగుంటుంది. అప్పటి వరకు పుష్ప గాడి అడ్డా అన్నట్లుగా ఇండియన్ బాక్సాఫీస్ కొనసాగుతూనే ఉంటుంది.