Begin typing your search above and press return to search.

వీడియో: ట్రిప్తీ న‌డుము ఊపుడుపై ఘాటైన కామెంట్లు!

సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నులు ఎంత వేగంగా స్పందిస్తే, అంత వేగంగా ప్ర‌తిదీ ట్రెండింగ్ అవుతుంది.

By:  Tupaki Desk   |   25 Sep 2024 4:05 PM GMT
వీడియో: ట్రిప్తీ న‌డుము ఊపుడుపై ఘాటైన కామెంట్లు!
X

సోష‌ల్ మీడియాల్లో నెటిజ‌నులు ఎంత వేగంగా స్పందిస్తే, అంత వేగంగా ప్ర‌తిదీ ట్రెండింగ్ అవుతుంది. అలాంటి ఒక వీడియో గురించి ఇప్పుడు చ‌ర్చ సాగుతోంది. ఇది యానిమ‌ల్ బ్యూటీ ట్రిప్తి దిమ్రీ డ్యాన్స్ మూవ్స్ ని హైలైట్ చేసిన వీడియో కాబ‌ట్టి మాస్ లో పెద్ద ర‌చ్చ‌వుతోంది. యానిమల్, బ్యాడ్ న్యూజ్ చిత్రాల్లో రెచ్చిపోయి అందాలు ఆర‌బోసింది ట్రిప్తీ... హీరోతో ఘాటైన స‌న్నివేశాల్లో జీవించింది. దాని ఫ‌లితం ఆ సినిమాల క‌లెక్ష‌న్లలో ప్ర‌తిఫ‌లించింది. మాస్ ఆడియెన్, యూత్ రిపీటెడ్ గా ఈ సినిమాలు చూసారు.

ఇప్పుడు ఆయాచితంగా అందివ‌చ్చిన ఈ వ‌రాన్ని ఏ ద‌ర్శ‌క‌నిర్మాతా వ‌దిలి పెట్ట‌డం లేదు. ట్రిప్తీ నుంచి స‌హ‌జంగానే మాస్ ఆడియెన్ ఏం ఆశిస్తారో దానిని పిండుకోవ‌డంలో ఎవ‌రికి వారు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉన్నారు. ట్రిప్తీతో అదిరిపోయే డ్యాన్స్ మూవ్స్ కి ఆస్కారం ఉన్న పాట‌ల‌ను ఎంచుకుంటున్నారు. కొరియోగ్ర‌ఫీ జిమ్మిక్ ని జోడించి సినిమాకి ఆక‌ర్ష‌ణ‌ను పెంచాల‌నే ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్నారు. కానీ `విక్కీ విద్యా కా వో వాలా` వీడియో సాంగ్‌లోని `మేరే మెహబూబ్` పాటలో ట్రిప్తీ డ్యాన్స్ మూవ్స్ రెచ్చ‌గొట్టే విధంగా ఉండ‌టంతో ఇది వివాదాలకు కేంద్రబిందువుగా నిలిచింది. రెచ్చగొట్టే నడుము ఊపుడు, కాలి క‌ద‌లిక‌ల‌తో మ‌తులు చెడ‌గొడుతోంది ఈ బ్యూటీ. ట్రిప్తీ బోల్డ్ మూవ్స్ చూడ‌గానే ఇది క‌చ్ఛితంగా నోరా ఫ‌తేహి త‌ర‌హాలో చెల‌రేగ‌డ‌మే అంటూ జ‌నం ఘాటైన కామెంట్లు చేస్తున్నారు. ఒక మెయిన్ స్ట్రీమ్ హీరోయిన్ అయిన ట్రిప్తీ కూడా మ‌లైకా- నోరా ఫ‌తేహి త‌ర‌హా ఐట‌మ్ భామ‌లా దిగ‌జారింద‌నేది చాలామంది ఆరోప‌ణ‌. ఇవి లైంగికంగా ప్రేరేపించే చెత్త స్టెప్పులు (డ్యాన్సులు) అని ఆ వీడియోపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.

అభ్యంత‌ర‌క‌ర‌మైన స్ట‌ఫ్‌ని అందించేందుకు ట్రిప్తీ ఎందుకు ఆరాట‌ప‌డుతోందో అర్థం కావ‌డం లేద‌ని మెజారిటీ నెటిజ‌నులు వ్యాఖ్యానించారు. అయితే ట్రిప్తీ డ్యాన్సుల‌ను స‌మ‌ర్థించేవారు లేక‌పోలేదు. ఆ పాట థీమ్ కి త‌గ్గ‌ట్టు అలా డ్యాన్స్ చేయాల్సి వ‌చ్చింద‌ని, ప్రతిభావంతురాలైన ఈ బ్యూటీని కేవలం ఒక నృత్య ప్రదర్శన ఆధారంగా అంచనా వేయకూడదని కొంద‌రు విశ్లేషించారు. ఏది ఏమైనా `మేరే మెహబూబ్`తో మేక‌ర్స్ ఎలాంటి టార్గెట్ ఆశించారో దానిని చేరువ‌య్యారు. ట్రిప్తీ దిమ్రీ డ్యాన్స్ మూవ్స్ తో ఇప్పుడు `విక్కీ విద్యా కా వో వాలా` బ‌జ్ పెరిగింది. దీనిపై చ‌ర్చ జ‌ర‌గాలి అనుకున్నారు .. అది జ‌రిగింది. రాజ్ కుమార్ రావు `స్త్రీ 2`కి శ్ర‌ద్ధా క‌పూర్ ల‌క్కీ ఛామ్ అనుకుంటే, ఇప్పుడు ట్రిప్తీ కార‌ణంగాను మ‌రో విజ‌యం ద‌క్కేట్టే ఉంది. ప్ర‌తిభావంతుడైన న‌టుడికి ఈ హీరోయిన్లు అంతా ల‌క్కీ మ‌స్క‌ట్లుగా మారి సేవ‌లందిస్తున్నారు!