ఫాస్ట్ ఫుడ్ స్టార్లు అన్నది ఎవర్ని బాస్!
ఈ రోజుల్లో స్టార్ డమ్ అనేది ఫాస్ట్ పుడ్ సెంటర్ లాంటింది.
By: Tupaki Desk | 31 July 2023 6:33 AM GMTబాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఎలాంటి బ్యాకప్ లేకుండానే బాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగాడు. అసిస్టెంట్ డైరెక్టర్ గాకెరీర్ ప్రారంభించి లఘు చిత్రాలు సైతం చేసి స్టార్ అయిన నటుడు. 'ఉరి' హిట్ తో పాన్ ఇండియా లో ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత వార్ నేపథ్యంలో గల సినిమాల కు బ్రాండ్ హీరోగా మారిపోయాడు. అటుపై స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని స్టార్ లీగ్ లో చేరాడు.
మరి ఈ స్టార్ హీరోకి స్పూర్తి ఎవరు? ఎవర్ని ఆదర్శంగా తీసుకుని పరిశ్రమ లో ఎదిగాడు? అంటే అతని నోట వెంట హృతిక్ రోషన్ పేరు టక్కున వస్తుంది. డాన్సుల్లో హృతిక్ స్పూర్తితోనే ఇంట్లో డాన్సులు ప్రాక్టీస్ చేసేవారు. తాజాగా నటుల స్టార్ డమ్ ని ఉద్దేశించి విక్కీ కౌశల్ ఆసక్తిర వ్యాఖ్యలు చేసారు. ఈ రోజుల్లో స్టార్ డమ్ అనేది ఫాస్ట్ పుడ్ సెంటర్ లాంటింది. అది తాత్కాలికం మాత్రమే. అలాంటి స్టార్ డమ్ నాకొద్దు.
అసలైన స్టార్ డమ్ అంటే చిత్ర పరిశ్రమ లో సుదీర్ఘకాలం కొనసాగుతుంది. అది ఎంతో కష్టపడితే గానీ దక్కదు. అందుకు చాలా ప్రతిభ కావాలి. అలాంటి వారు మాత్రమే పరిశ్రమలో ఎదుగుతారు. పెద్ద తారలుగా మారుతారు. నా దృష్టిలో షారుక్ ఖాన్..సల్మాన్ ఖాన్..హృతిక్ రోషన్ లాంటి వారే స్టార్లు. వాళ్లను మించిన స్టార్లు ఎవరూ లేరన్నది నా వ్యక్తిగత ఫీలింగ్' అన్నారు.
అయితే ఈ వ్యాఖ్యల పై కొంత నెగివిటీ తెర పైకి వస్తోంది. విక్కీ కౌశల్ ఇలా స్పందించడం కొంత మంది నటుల్ని కించపరిచినట్లే అవుతుందని నెటి జనులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. వాళ్లని గొప్ప స్టార్లు అని చెప్పడంలో తప్పు లేదు. వాళ్ల తర్వాత వచ్చిన వారు ఎంతో మంది ఎదిగారు.
ఖాన్ త్రయాన్ని పక్కనబె డితే వాళ్లకన్నా ఎక్కువ కష్టాలు పడి ఎదిగిన నటులు..యంగ్ స్టార్స్ ఎంతో మంది ఉన్నారు. స్టార్ డమ్ అనేది కొందరికే ఆ పాదించడం భావ్యం కాదంటున్నారు. ఏ జనరేషన్ కి తగ్గట్టు ఆ జనరేషన్ బట్టి స్టార్ డమ్ మారుతుంటుందని..వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలని అంటున్నారు. మరి వీటి పై విక్కీ కౌశల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.