Begin typing your search above and press return to search.

విక్ -క్యాట్‌ పెళ్ల‌యి రెండేళ్ల‌యినా ఇంకా శుభ‌వార్త చెప్పరేమి?

విక్కీ లేదా క‌త్రిన‌ బంధువుల్లో ఎవరైనా 'శుభవార్త' చెప్ప‌మని ఈ జంట‌ను ఒత్తిడి చేశారా? అని ప్ర‌శ్నించారు. పిల్లలు పుట్టారా? అనేదే అంద‌రి క్యూరియాసిటీ.

By:  Tupaki Desk   |   9 Sep 2023 3:54 AM GMT
విక్ -క్యాట్‌ పెళ్ల‌యి రెండేళ్ల‌యినా ఇంకా శుభ‌వార్త చెప్పరేమి?
X

విక్కీ కౌశల్- కత్రినా కైఫ్ జంట‌ ల‌వ్ లైఫ్, పెళ్లి త‌ర్వాత లైఫ్ గురించి తెలిసిందే. బాలీవుడ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన విజయవంతమైన క‌పుల్ గా ఈ జోడీ సుప‌రిచితం. కొన్ని సంవత్సరాల పాటు రహస్యంగా డేటింగ్ చేసిన తర్వాత డిసెంబర్ 2021లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుండి తరచూ సోషల్ మీడియాల్లో ఒకరిపై ఒకరు తమ ప్రేమను వ్యక్తం చేసుకోవ‌డం అభిమానుల‌కు తెలుసు. అయితే ఈ జంట పెళ్ల‌యి రెండేళ్ల‌వుతున్నా ఇంకా ఆ శుభ‌వార్త చెప్ప‌లేదేమిటి? అంటూ ఒక సెక్ష‌న్ ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తోంది.

దీనికి విక్ క్యాట్ జంట స‌మాధానం కోసం వెత‌కాల్సి వ‌స్తోంది. తాజాగా రేడియో సిటీ ఇండియా ఇంటర్వ్యూలో ఇదే ప్ర‌శ్న ఎదురైంది. విక్కీ లేదా క‌త్రిన‌ బంధువుల్లో ఎవరైనా 'శుభవార్త' చెప్ప‌మని ఈ జంట‌ను ఒత్తిడి చేశారా? అని ప్ర‌శ్నించారు. పిల్లలు పుట్టారా? అనేదే అంద‌రి క్యూరియాసిటీ. అయితే దీనికి విక్కీ ఛ‌లోక్తిగా జ‌వాబిచ్చాడు. ''ఎవరూ లేరు.. వారంతా మంచి వ్యక్తులు (కోయి భీ నహీ దాల్ రహా... వైసే బాడే కూల్ హైన్) అని టూకీగా స‌మాధాన‌మిచ్చాడు.

కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్న విష‌యం మొదటగా ఎవరికి తెలుసు? అని కూడా ఇంట‌ర్వ్యూలో అడిగారు. ''ఇంట్లో మొదటగా తెలిసిన వాళ్ళు మా అమ్మా నాన్నలే.. ఇద్దరినీ కలిసి విష‌యం చెప్పాన''ని కూడా చెప్పాడు. ఆ వార్త విని మీ తల్లిదండ్రులు న‌మ్మారా? అని ప్ర‌శ్నించ‌గా... అమ్మా నాన్న‌ నన్ను నమ్మారనే అనుకుంటున్న‌ట్టు విక్కీ స‌మాధాన‌మిచ్చాడు.

అయితే స్టిల్ ఫోటోగ్రాఫ‌ర్లలో వైరల్ భయాని వ‌ల్ల‌నే విక్కీ తల్లిదండ్రులకు ఈ వార్త తెలిసిందని హోస్ట్‌ చమత్కరించారు. దానికి విక్కీ ప్ర‌తిస్పందిస్తూ.. వైరల్ భ‌యానీ నుండి ఇలాంటివి తెలుసుకునే పరిస్థితి లేదు అని అన్నాడు.

మరో ఇంటర్వ్యూలో.. విక్కీ కత్రినాకు డేటింగ్ గురించి ఎలా ప్ర‌పోజ్ చేసారు? అని అడిగారు. మిమ్మల్ని డిన్నర్‌కి తీసుకెళ్తాను! (టెక్స్ట్ ద్వారా) అన్నంత సింపుల్‌గా ఈ డేటింగ్ సాగింది. కానీ ఆ దశకు చేరుకోవడానికి ఒక ప్రయాణం ఉంది.

ఆ ప్రయాణం కెమెరాల కోసం కాదు.. చివరికి నేను చేయగలను అన్నంత సింపుల్‌గా మారింది. డిన్నర్‌కి తీసుకెళ్తావా? అంటూ కత్రినా త‌న‌ని అడిగేంత‌గా ఎద‌గ‌డాన్ని మొదట్లో వింతగా భావించాన‌ని కూడా అతడు వెల్లడించాడు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే... విక్కీ ఇటీవల సారా అలీ ఖాన్‌తో కలిసి కామెడీ-డ్రామా 'జరా హాట్కే జరా బచ్కే'లో కనిపించాడు. అందరినీ ఆశ్చర్యపరిచిన ఈ చిత్రం కమర్షియల్‌గా విజయం సాధించింది. అతను తదుపరి ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ, సామ్ బహదూర్, డుంకీ, మేరే మెహబూబ్ మేరే సనమ్‌లో కనిపించనున్నాడు. మరోవైపు కత్రినా సల్మాన్ ఖాన్‌తో యాక్షన్ థ్రిల్లర్ టైగర్ 3 లో న‌టిస్తోంది. ఈ ఏడాది దీపావళికి సినిమాను విడుదల చేయనున్నారు.