స్టార్ హీరో తండ్రి పని లేక ఆత్మహత్యాయత్నం?
గ్లామర్ ప్రపంచంలో స్థిరంగా అవకాశాలు రావడం అంత సులువేమీ కాదు. ఇక్కడ అదృష్టం వరించేది ఏ కొందరినో
By: Tupaki Desk | 18 July 2024 8:30 AM GMTగ్లామర్ ప్రపంచంలో స్థిరంగా అవకాశాలు రావడం అంత సులువేమీ కాదు. ఇక్కడ అదృష్టం వరించేది ఏ కొందరినో. చాలా మంది ఆర్టిస్టుల పరిస్థితి ఎక్కే గడప.. దిగే గడప. నటించేందుకు అవకాశాలు రావడం చాలా కష్టం. అలాంటి ఒక క్లిష్ఠ పరిస్థితిని తన తండ్రి ఎదుర్కొన్నాడని బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్ వెల్లడించారు. పని లేకపోవడంతో తన తండ్రి సామ్ కౌశల్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడని అతడు తెలిపాడు.
చండీగఢ్‌లో తాజా ఇంటర్వ్యూలో విక్కీ కౌశల్ తన తండ్రి సామ్ కౌశల్ ఒకప్పుడు పని లేకపోవడంతో తన జీవితాన్ని ముగించడానికి ప్రయత్నించాడని ఆవేదనగా వెల్లడించాడు. విక్కీ తండ్రి గారైన సామ్ కౌశల్ 90 ల ప్రారంభంలో హిందీ చిత్రాలలో స్టంట్స్ కొరియోగ్రఫీ చేసిన పాపులర్ యాక్షన్ డైరెక్టర్. కానీ ఒకానొక సమయంలో ఆఫర్లు తగ్గిపోవడంతో సామ్ కౌశల్ ఆత్మ హత్యాయత్నం చేసారట. కానీ అతడిని కుటుంబం రక్షించింది.
సినిమా పరిశ్రమ అంటే జూదమని, అదృష్టవంతులు మాత్రమే బతుకుతారని కూడా విక్కీ కౌశల్ అనుభవ పూర్వకంగా చెప్పారు. అతడు తన తాజా చిత్రం బ్యాడ్ న్యూజ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రంలో విక్కీ రొమాంటిక్ రోల్ పోషిస్తుండగా, యానిమల్ ఫేమ్ ట్రిప్ట్ డిమ్రీ అతడితో రొమాన్స్ చేస్తోంది. ఈ ఇద్దరి స్టీమీ రొమాన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పటికే ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. రొమాంటిక్ సింగిల్స్ లో ఈ జంట హీటెక్కిస్తోంది. ఈ శుక్రవారం బ్యాడ్ న్యూజ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పాటలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. మేకర్స్ కూడా ఈ చిత్రాన్ని ఘనంగా ప్రమోట్ చేస్తున్నారు.