Begin typing your search above and press return to search.

ఇసుక మాఫియాతో హీరో లొల్లి..దాడికి య‌త్నం!

ఇసుక మాఫియాతో ఆయ‌న‌కెందుకు లొల్లి అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

By:  Tupaki Desk   |   22 July 2024 8:36 AM GMT
ఇసుక మాఫియాతో హీరో  లొల్లి..దాడికి య‌త్నం!
X

బాలీవుడ్ స్టార్ హీరోపై ఇసుక ముఠా దాడికి య‌త్నించిందా? 500 మంది చుట్టుముట్టినా ఆ స్టార్ తెలివిగా ఎస్కేప్ అయ్యాడా? తృటిలో ప్రాణాయ‌పాయం నుంచి త‌ప్పించుకున్నాడా? అంటే అవున‌నే తెలుస్తోంది. ఇంత‌కీ ఎవ‌రాస్టార్ . ఇసుక మాఫియాతో ఆయ‌న‌కెందుకు లొల్లి అంటే అస‌లు వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా స్టార్ గా ఎదిగిన న‌టుడు విక్కీ కౌశ‌ల్ గురించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఇత‌డే ఇసుక మాఫియా నుంచి తృటిలో త‌ప్పించుకున్నాడు. బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అనురాగ్ క‌శ్య‌ప్ వ‌ద్ద `గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్` సినిమాకి ఏడీగా పనిచేస్తోన్న స‌మ‌యంలో బొగ్గు స్మ‌గ్లింగ్ స‌న్నివేశాలు రియ‌ల్ గా షూట్ చేసారుట‌. ఇసుక అక్ర‌మ తవ్వ‌కాల‌ను షూట్ చేయ‌డం కోసం త‌మ టీమ్ లోని కొంత మంది ఆస్పాట్ కి వెళ్లారుట‌. ఆసమ‌యంలో ఎలాంటి భ‌యం లేకుండా ఇసుక ముఠా బ‌హిరంగంగానే ఇసుక స్మ‌గ్లింగ్ కి పాల్ప‌డుతున్నారుట‌.

ఆ స‌న్నివేశాల‌న్నింటిని ర‌హ‌స్యంగా షూట్ చేస్తున్నారుట‌. ఈ స‌మ‌యంలో త‌మ‌ని గ‌మ‌నించి చుట్టూ 500 మంది గ్యాంగ్ రౌండ‌ప్ చేసారుట‌. కెమెరా మ్యాన్ ని అదుపులోకి తీసుకుని చిక‌త‌బాదారుట‌. దీంతో మిగ‌తా వారు మీద‌కి రావ‌డంతో వాళ్ల‌ని మాట‌ల్లోకి దించి తెలివిగా అక్క‌డ‌ నుంచి భ‌య‌ప‌డి పారిపోయిన‌ట్లు విక్కీ కౌశ‌ల్ తెలిపాడు. అలాగే బెనార‌స్ స్టేష‌న్ లో న‌వాజుద్దీన్ సిద్దీఖిపై స‌న్నివేశాలు షూట్ చేస్తున్న‌ప్పుడు పోలీసులు ప‌ట్టుకోబోయారుట‌.

కారులో కెమెరా సీక్రెట్ గా పెట్టి వాళ్ల‌ను షూట్ చేస్తున్నారుట‌. దానిపై పోలీసులు సీరియ‌స్ అవ్వ‌డంతో అక్క‌డ నుంచి పారిపోయిన‌ట్లు తెలిపాడు. మొత్తానికి విక్కీ కౌశ‌ల్ న‌టుడు కాక‌ముందే చాలా సాహ‌సాలే చేసిన‌ట్లు క‌నిపిస్తుంది. విక్కీ కౌశ‌ల్ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా కెరీర్ ప్రారంభించి న‌టుడిగా ప్ర‌మోట్ అయి అక్క‌డ నుంచి స్టార్ గా ఎదిగాడు. అనంత‌రం స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్ ని ప్రేమించి పెళ్లి చేసుకు న్నాడు. ఇటీవ‌లే విక్కీ కౌశ‌ల్ న‌టించిన `బ్యాడ్ న్యూజ్` కూడా రిలీజ్ అయి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే.