విక్కీ కౌశల్ ఎందుకలా బుకాయిస్తున్నాడు?
తాజాగా `బ్యాడ్ న్యూజ్` ప్రమోషన్ లో భాగంగా విక్కీ కౌశల్ పాల్గొంటున్నాడు.
By: Tupaki Desk | 16 July 2024 6:13 AM GMTభార్య గర్భం విషయంలో భర్త బుకాయిస్తున్నాడా? మీడియాని సైతం ఆ హీరో అడ్డంగా బుకాయించేస్తున్నా డా? ఎలా ప్రశ్నించినా అతని నుంచి ఒకే సమాధానం వస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. ఆ బాలీవుడ్ జోడీ ఎవరు? అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. క త్రినా కైఫ్ గర్భందాల్చినట్లు బేబిబంప్ ఫోటోలు కొన్ని వైరల్ అయిన సంగతి తెలిసిందే. రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆసుపత్రులకు తిరగడం వంటి వీడియోలు కూడా వెలుగులోకి వచ్చాయి.
తాజాగా `బ్యాడ్ న్యూజ్` ప్రమోషన్ లో భాగంగా విక్కీ కౌశల్ పాల్గొంటున్నాడు. దీనిలో భాగంగా ఢిల్లీలో జరిగిన ప్రెస్ మీట్ లో మీ భార్య గర్భంతో ఉన్నట్లున్నారు? చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి? నెట్టింట ప్రచారం సాగుతుంది? దీనిపై మీరేమంటారంటూ విక్కీ కౌశల్ ని మీడియా సూటిగా ప్రశ్నించింది. అందుకు ఆయన మళ్లీ పాత పాటే పాడాడు. `ఇలాంటి విషయాలు అభిమానులతో పంచుకోవడానికి చాలా సంతోషిస్తాం.
ఏదైనా ఉంటే మీతోనే ముందుగా పంచుకుంటా. ప్రస్తుతానికి ఎలాంటి శుభ వార్తలేదు. అవన్నీ కేవలం రూమర్లు మాత్రమే. ప్రస్తుతానికి బ్యాడ్ న్యూజ్ చిత్రాన్ని ఎంజాయ్ చేయండి` అనేసాడు. అయితే అక్కడ మీడియా విక్కీ కౌశల్ మాటలు నమ్మలేదు. ఇదంతా నమ్మోచ్చా? నిజమేనా? అంటూ మళ్లీ తిరిగి ప్రశ్నించారు. దీనికి మాత్రం విక్కీ కౌశల్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే తప్పకుండా మీతో పంచుకుంటా అంటూ నవ్వుతూ చెప్పి వెళ్లిపోయాడు.
దీంతో విక్కీ కౌశల్ బుకాయిస్తాడనే చర్చ తెరపైకి వస్తుంది. భార్య గర్భం విషయం దాచాల్సినంత అవసరం ఏముంది? అంటూ నెటి జనులు సైతం ప్రశ్నిస్తున్నారు. దాయడం కన్నా ఆయన బుకా యించడం ఏమాత్రం సమంజసంగా లేదంటున్నారు. అయితే ఇదంతా ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగత విషయం. ఆ లెక్కన చూస్తే? రామ్ చరణ్ -ఉపాసన దంపతులు ఇంతవరకూ తమ కుమార్తె ఫోటోని కూడా రివీల్ చేయలేదు. ఇటీవలే మొదటి పుట్టిన రోజు కూడా జరిగింది. ఆ రోజు కూడా లీక్ చేయలేదు. అభిమానులకు కేవలం కాళ్లు..చేతులు మాత్రమే చూపించారు.