Begin typing your search above and press return to search.

ర‌ష్మిక‌తో కుర్ర‌హీరో కెమిస్ట్రీ ఆ లెవ‌ల్లో

అదంతా అటుంచితే, ర‌ష్మిక వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో గుబులు రేపుతున్నాయి.

By:  Tupaki Desk   |   2 Aug 2024 6:11 PM GMT
ర‌ష్మిక‌తో కుర్ర‌హీరో కెమిస్ట్రీ ఆ లెవ‌ల్లో
X

ర‌ష్మిక మంద‌న్నను త‌ల‌వ‌గానే గుర్తుకొచ్చే కొన్ని సంగ‌తులున్నాయి. అంద‌చందాలు.. న‌ట‌ప్ర‌తిభ.. ల‌క్ ఫ్యాక్ట‌ర్ వీట‌న్నిటి క‌ల‌యికతో దూసుకొచ్చిన మేటి క‌థానాయిక‌. ఇన్నాళ్లు టాలీవుడ్ ని ఏలిన ఈ భామ ఇప్పుడు బాలీవుడ్ ని ఏలుతోంది. అక్క‌డ వ‌రుస సినిమాల‌కు క‌మిట‌వుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది. సిద్ధార్థ్ మ‌ల్హోత్రా, ర‌ణ‌బీర్ లాంటి క్రేజీ స్టార్ల స‌ర‌స‌న న‌టించేసిన ఈ బ్యూటీ ఇప్పుడు స‌ల్మాన్ ఖాన్, విక్కీ కౌశ‌ల్ లాంటి స్టార్ల స‌ర‌స‌నా ఆడిపాడుతోంది.


అదంతా అటుంచితే, ర‌ష్మిక వ‌రుస ఫోటోషూట్లు అంత‌ర్జాలంలో గుబులు రేపుతున్నాయి. తాజాగా డిజైనర్లు ఫల్గుణి - షేన్ పీకాక్ సాంప్ర‌దాయ దుస్తుల్లో రష్మిక మందన్న క‌నిపించింది. ర‌ష్మిక‌, విక్కీ కౌశల్ స‌హా ఫోటోలో ఉన్న టీమ్ భారతీయ సాంప్రదాయ విధానంలో నేసిన దుస్తులను ధరించడం గర్వించ‌ద‌గిన‌ది. ర‌ష్మిక క్రిస్ట‌ల్స్ తో రూపొందించిన స్పెష‌ల్ హాఫ్ షోల్డ‌ర్ లెహంగా ధ‌రించి ఎంతో అందంగా క‌నిపిస్తోంది. ముఖ్యంగా విక్కీతో ర‌ష్మిక కెమిస్ట్రీ అద్భుతంగా వ‌ర్క‌వుటైంద‌ని ఈ ఫోటోషూట్ చెబుతోంది. క‌త్రిన‌తో కూడా విక్కీ కెమిస్ట్రీ ఇంతగా వ‌ర్క‌వుట్ కాలేదంటూ ఇప్పుడు యువ‌త‌రం స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్ప‌టికి ఈ ఫోటోగ్రాఫ్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతోంది.


విక్కీ షేర్ చేసిన ఫోటోషూట్ గురించి సాంప్ర‌దాయం గురించి అద్భుత‌మైన కామెంట్లు వినిపిస్తున్నాయి. భారతదేశంలోని గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవిస్తూ, సెల‌బ్రేట్ చేసుకునే ఒక చిరస్మరణీయమైన ప్ర‌క్రియ ఇది. తన క్యాప్షన్‌లో విక్కీ డిజైనర్లు ఫల్గుణి- షేన్ పీకాక్‌లతో పాటు స్వదేశ్ ఆన్‌లైన్ -FDCI (ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) లు సంయుక్త‌ ప్రదర్శనకు కృతజ్ఞతలు తెలిపాడు.


మన సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించడం, సెల‌బ్రేట్ చేయ‌డం కోసం గడిపిన సాయంత్రం ఇది. ఇలాంటి అద్భుతమైన ప్రదర్శనలో మమ్మల్ని భాగం చేసినందుకు పీకాక్ ఇండియా వారికి విక్కీ ధ‌న్య‌వాదాలు తెలిపారు.