Begin typing your search above and press return to search.

అలా చేస్తే చంపేస్తామంటూ కంగ‌న‌కు బెదిరింపులు!

మ‌రి కంగ‌న ఎందుకు బెదిరిపుల‌కు గురైందో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కంగ‌న రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో `ఎమర్జెన్సీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 7:38 AM GMT
అలా చేస్తే చంపేస్తామంటూ కంగ‌న‌కు బెదిరింపులు!
X

బాలీవుడ్ న‌టి కంన‌గా ర‌నౌత్ హ‌త్యా బెదిరింపులకు గురైంది. ఖలిస్తాన్ ఉగ్ర‌వాది జ‌ర్నైల్ సింగ్ భింద్ర‌న్ వాల్ ని టెర్ర‌రిస్ట్ గా చూపిస్తే గ‌నుక ఇందీరాగాంధీని హ‌త్య చేసిన‌ట్లు చంపేస్తామ‌ని విక్కీ థామ్ సింగ్ అనే వ్య‌క్తి బెదిరించాడు. మ‌రి కంగ‌న ఎందుకు బెదిరిపుల‌కు గురైందో తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే. కంగ‌న రనౌత్ ప్ర‌ధాన పాత్ర‌లో `ఎమర్జెన్సీ` తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

అన్ని ప‌నులు పూర్తి చేసుకుని సెప్టెంబ‌ర్ 6న చిత్రాన్ని రిలీజ్ చేస్తుంది. మాజీ ప్ర‌ధానీ ఇందిరాగాంధీ విధించిన ఎమ‌ర్జెన్సీని నేప‌థ్యాన్ని ఆధారంగా తీసుకుని కంగ‌న స్వీయా ద‌ర్శ‌క‌త్వంలో ఎమ‌ర్జన్సీ టైటిల్ తో చిత్రాన్ని తెర‌కెక్కించిన సంగతి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే అమ్మ‌డు ఇప్ప‌టికే ప‌లుమార్లు బెదిరింపుల‌కు ఎదుర్కోంది. కొంద‌రు దుండ‌గులు అత్యాచారం చేసి చంపేస్తామ‌ని ఇప్ప‌టికే బెదిరించారు.

తాజాగా సినిమా రిలీజ్ నేప‌థ్యంలో విక్కీ థామ‌స్ సింగ్ అనే వ్య‌క్తి ఓ వీడియో లో మాట్లాడుతూ ఈ బెదిరింపుల‌కు పాల్ప‌డ్డాడు. మాజీ ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌త్యా ఉదంతాన్నిగుర్తు చేసాడు. `ఈ సినిమాలో అత‌న్ని( ఖ‌లిస్తాన్ ఉగ్ర‌వాది జ‌ర్లైల్ సింగ్ భింద్ర‌న్ వాల్) ని ఉగ్ర‌వాదిగా చూపిస్తే మీరు ఎవ‌రి గురించి సినిమా తీస్తున్నారో? ఆ వ్య‌క్తికి ఏం జ‌రిగిందో గుర్తుంచుకోండి. స‌త్వంత్ సింగ్, బియాంత్ సింగ్ ఆమెని ఎలా చంపారో తెలుసు క‌దా.

వారి మాదిరే మేము మీ త‌ల అర్పిస్తాం. లేదా త‌ల న‌రికేస్తాం` అంటూ బెదిరించారు. ప్ర‌స్తుతం ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. పంజాబ్ లో వేర్పాటువాదం కోరుకున్న వారిలో భింద్ర‌న్ వాలే ఒక‌రు అన్న‌ది తెలిసిందే. వారు మాట్లాడిన వీడియోను మ‌హారాష్ట్ర‌, పంజాబ్ పోలీసుల‌కు ట్యాగ్ చేస్తూ కంగ‌న షేర్ చేసింది. అయితే ఈ వీడియోపై నెటి జ‌నులు భ‌గ్గుమ‌న్నారు. దేశంలో ఏం జ‌రుగుతోంది? బీజీపీ ఎంపీ నే చంపేస్తామ‌ని బెదిరిస్తారా? దేశం ఎటుపోతుంది? బెదిరించిన వాడిని అలా ఎలా వ‌దిలేస్తున్నారు? ఓ గొప్ప క‌థ‌ని తెర‌పై ఆవిష్క‌రిస్తే బెదిరాస్తాడా? అలాంటి వారిని ప‌ట్టుకుని ఉరి తీయాలంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.