విక్టరీ వెంకటేష్ రెండో కుమార్తె నిశ్చితార్థం!
వెంకటేష్ దగ్గుబాటి రెండవ కుమార్తె హయవాహిని ఇటీవలే నిశ్చితార్థం పూర్తయింది.విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ని హయవాహిని వివాహమాడనుంది.
By: Tupaki Desk | 26 Oct 2023 4:39 PM GMTదగ్గుబాటి ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోగనున్నాయి. వెంకటేష్ పెద్ద కుమార్తె అశ్రిత పెళ్లి జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత ఈ సంతోషకరమైన వార్త అందింది. త్వరలో జరగబోయే పెళ్లి గురించిన వివరాలు వెల్లడయ్యాయి. వెంకటేష్ దగ్గుబాటి రెండవ కుమార్తె హయవాహిని ఇటీవలే నిశ్చితార్థం పూర్తయింది.విజయవాడకు చెందిన ఓ డాక్టర్ ని హయవాహిని వివాహమాడనుంది. నిశ్చితార్థ వేడుక నిన్న విజయవాడలో అంగరంగ వైభవంగా జరిగింది.
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దగ్గుబాటి కుటుంబం ఈ వేడుకను ఘనంగా జరుపుకుంది. దీనికి మెగాస్టార్ చిరంజీవి సహా సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం .. సినీ పరిశ్రమకు చెందిన ఇతర ప్రముఖులు హాజరయ్యారు. నిశ్చితార్థలంలో దగ్గుబాటి కజిన్స్ రానా, నాగ చైతన్య కూడా కనిపించారు. చై -రానా దగ్గుబాటి ఎథ్నిక్ వేర్‌లో స్టైలిష్‌గా హాజరు కాగా, మహేష్ బాబు ఫార్మల్ లుక్ లో సింపుల్ గా కనిపించారు. స్నేహితులు, బంధువుల్లో ముఖ్యులు వేడుకకు తరలివచ్చారు.
సోషల్ మీడియాల్లో అంతగా కనిపించని వెంకటేష్ కుటుంబ వేడుకకు సంబంధించిన వివరాలేవీ అందుబాటులో లేవు. తన పిల్లలకు కెరీర్ సహా ఇతర వ్యక్తిగత ఎంపికలు చేసుకునేందుకు స్వయంప్రతిపత్తిని ఇవ్వాలనే సూత్రానికి ఎల్లప్పుడూ వెంకటేష్ కట్టుబడి ఉన్నారు. సినిమా పరిశ్రమ నుండి ఎటువంటి మితిమీరిన ప్రభావం తమ పిల్లలపై లేకుండా జాగ్రత్తపడతారన్నది తెలిసిందే. ఈ విధానం తన పిల్లల ఆసక్తుల ప్రకారం ముందుకు సాగే స్వేచ్ఛను ఇచ్చింది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. వెంకటేష్ చివరి సినిమా విడుదలై ఏడాది పూర్తయింది. గతేడాది ఎఫ్3 -ఓరి దేవా సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. ఈ సంవత్సరం 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్‌తో ఆన్‌లైన్ స్ట్రీమింగ్ రంగంలోకి ప్రవేశించారు. హిందీ చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కా జాన్'లో ప్రధాన పాత్రను పోషించారు. ప్రస్తుతం వెంకీ కథానాయకుడిగా 'సైంధవ్' చిత్రంతో బిజీగా ఉన్నాడు.
దగ్గుబాటి కుటుంబం గురించి ..వెంకటేష్ దగ్గుబాటి- నీరజ 1985 లో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. ఆశ్రిత, హయవాహిని, భావన, అర్జున్. వారి పెద్ద కుమార్తె ఆశ్రిత 2019లో జైపూర్‌లో అంగరంగ వైభవంగా వినాయక్ రెడ్డిని వివాహం చేసుకున్నారు. పెద్ద కుమార్తె ఆశ్రిత ఇన్ ఫినిటీ ప్లేటర్ అనే బేకరీ చైన్ ని నిర్వహిస్తున్నారు. ఆశ్రిత తన భర్తతో స్పెయిన్ లో నివసిస్తున్నారు.