Begin typing your search above and press return to search.

బాహుబలి పెద్ద డిజాస్టర్ అయ్యింది

By:  Tupaki Desk   |   9 May 2016 7:23 AM GMT
బాహుబలి పెద్ద డిజాస్టర్ అయ్యింది
X
బాహుబలి.. బ్లాక్ బస్టర్.. ఈ రెండూ జంట పదాలు. పది నెలలుగా ‘బాహుబలి’ సృష్టిస్తున్న సంచలనాలను వింటూనే ఉన్నాం. కంటూనే ఉన్నాం. ఇండియాలో మాత్రమే కాదు.. విడుదలైన ప్రతి దేశంలోనూ సంచలనాల మోత మోగిస్తూ దూసుకెళ్తోందా సినిమా. ఈ మధ్యే జర్మనీలో సైతం ఆ సినిమాను రిలీజ్ చేశారు. ఈ మధ్య జర్మనీలో ఇండియన్ సినిమాలతో పాటు విదేశీ చిత్రాలు చాలా బాగా ఆడుతున్న నేపథ్యంలో బాహుబలి కలెక్షన్ల మోత మోగించేస్తుందని.. పది కోట్లో ఇరవై కోట్లో ఖాతాలో వేసుకోవడం ఖాయమని అంతా అంచనా వేశారు. అక్కడి డిస్ట్రిబ్యూటర్ కూడా మంచి రేటు పెట్టి సినిమాను కొని.. చెప్పుకోదగ్గ స్థాయిలోనే రిలీజ్ చేశారు.

కానీ ‘బాహుబలి’కి జర్మన్ ప్రేక్షకులు చేదు అనుభవం మిగిల్చారు. అక్కడ విడుదలైన తొలి వారంలో బాహుబలి కేవలం 4200 యూరోలు.. అంటే మన రూపాయల్లో 3.3 లక్షలు మాత్రమే వసూలు చేసి షాకిచ్చింది. మన ఇండియన్ ఆడియన్స్ చూసినా కూడా ఇంతకంటే ఎక్కువ కలెక్షన్లే రావాలి. ఎన్నో చిత్రోత్సవాల్లో ప్రదర్శితమై.. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన సినిమాకు ఇలాంటి రెస్పాన్స్ రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎన్నో ఆశలతో ‘బాహుబలి’ని జర్మన్ లో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ కు భారీ నష్టాలు తప్పవని తెలుస్తోంది. ఇది బాహుబలి చిత్ర బృందానికి పెద్ద షాకే. ఆ మధ్య ఓ చిత్రోత్సవంలో ‘బాహుబలి’ని ప్రదర్శిస్తే ఐదు వేల మంది కెపాసిటీ ఉన్న ఆడిటోరియం నిండిపోయింది. అందరూ కేరింతలు కొడుతూ సినిమా చూశారు. మరి జర్మన్ ప్రేక్షకులు ఈ సినిమాకు ఇలాంటి ఫలితాన్నిచ్చారేంటో?