Begin typing your search above and press return to search.

భీమ్లానాయక్ ట్రైల‌ర్ 2: అహంకారం వ‌ర్సెస్ ఆత్మ‌విశ్వాసం!

By:  Tupaki Desk   |   23 Feb 2022 5:29 PM GMT
భీమ్లానాయక్ ట్రైల‌ర్ 2: అహంకారం వ‌ర్సెస్ ఆత్మ‌విశ్వాసం!
X
అహంకారంతో దూకుడు చూపించేవాడొక‌డైతే.. వాడికి ఆత్మ‌విశ్వాసంతో ముకుతాడు వేసేవాడు ఇంకొక‌డు. ఆ ఇద్ద‌రి మ‌ధ్యా ఠ‌గ్ ఆఫ్ వార్ ఎలా ఉండ‌బోతోంది? అన్న‌ది ఈనెల 25 నుంచి థియేట‌ర్ల‌లో చూడ‌బోతున్నాం. డేనియ‌ల్ వ‌ర్సెస్ భీమ్లా నాయ‌క్ పోరు చూసేందుకు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ ఒక‌వైపు.. ద‌గ్గుబాటి రానా అభిమానులు మ‌రోవైపు ఆస‌క్తిగా వేచి చూస్తున్నారు.

ఇప్ప‌టికే ట్రైల‌ర్ విడుద‌లై సంచ‌ల‌నం సృష్టించింది. ఇప్పుడు ట్రైల‌ర్ 2 విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం ప‌వ‌న్ వ‌ర్సెస్ రానా ఎపిసోడ్స్ హైలైట్. పవన్ కళ్యాణ్ సీరియ‌స్ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ ట్రైల‌ర్ 2 ప్రారంభమవుతుంది. ఇద్దరు శక్తివంతమైన వ్యక్తుల శత్రుత్వం సంఘర్షణతో నాన్-స్టాప్ యాక్షన్ ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని ట్రైల‌ర్ చెబుతోంది. ఈ ఇద్దరి ఇగో క్లాష్ వీక్షకులకు స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

అహంకారంతో పోలీసుల‌కు ఎదురెళ్లేవాడిగా డేనియ‌ల్ (రానా) పాత్ర‌ను తీర్చిదిద్ద‌గా.. వాడు ఎంత పెద్ద‌వాడైనా అణ‌చివేసే పొగ‌రున్న‌వాడిగా ఈగో ఉన్న‌వాడిగా భీమ్లా నాయ‌క్ (ప‌వ‌న్) పాత్ర‌ను తీర్చిదిద్దిన తీరు ఆక‌ట్టుకుంటోంది. ట్రైల‌ర్ మాస్ ని ఒక రేంజులో ఊపేస్తోంది. ముఖ్యంగా ఎస్.ఎస్ థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అత్యున్నత స్థాయి నాణ్యతతో రంజింప‌జేస్తోంది. పాత్ర‌ల మ‌ధ్య స‌న్నివేశాల ప‌వ‌ర్ ని ఈ నేప‌థ్య సంగీతం పెంచింది. విజువల్స్ లోని గ్రాండియారిటీ.. భారీ యాక్షన్ ని చిత్రీక‌రించిన తీరు ప్ర‌ధాన అస్సెట్ కానున్నాయి.

ఇక ఈ సినిమాకి త్రివిక్రమ్ మార్క్ పవర్ ఫుల్ డైలాగ్స్ .. సాగర్ కె చంద్ర అసాధారణమైన డైరెక్షన్ ప్ర‌తిభ పెద్ద విజ‌యాన్ని క‌ట్ట‌బెట్ట‌నున్నాయ‌ని ముందే ఫీల‌ర్స్ అందాయి. ట్రైల‌ర్ లోని ఒక స‌న్నివేశంలో నిత్యామీన‌న్ పాత్ర స్వ‌భావాన్ని ఆవిష్క‌రించారు. నాయ‌క్ లో స‌గం కాదు నాయ‌క్ కి డ‌బుల్ అంటూ డేనియ‌ల్ కి ఎదురెళ్లే నిత్యా పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దార‌ని అర్థ‌మ‌వుతోంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.