Begin typing your search above and press return to search.

సుప్రీమ్‌ సినిమా చూశాక భయమేస్తోంది

By:  Tupaki Desk   |   20 May 2016 3:30 PM GMT
సుప్రీమ్‌ సినిమా చూశాక భయమేస్తోంది
X

మొన్ననే రిలీజైన సాయిధరమ్‌ తేజ్‌ సినిమా ''సుప్రీమ్‌''. కంటెంట్‌ కాస్త రొటీన్ గానే ఉన్నా.. కామెడీ బాగుండటంతో ఆడియన్స్ బాగానే చూస్తున్నారు. అయితే ఈ సినిమాను చూసిన చాలామందికి ఇప్పుడు ఒక భయం పట్టుకుంది. నిజంగానే బాగా భయపడుతున్నారు. సుప్రీమ్‌ సినిమాలో ఒక కామెడీ సీక్వెన్స్ ఉంది. వాలెట్‌ పార్కింగ్‌ అంటూ.. 30 ఇయర్స్ పృథ్వీ అండ్‌ ప్రభాస్‌ శీను బీభత్సమైన కామెడీ చేశారు. ఏదో ఒక పెళ్ళి దగ్గరకు సూటూ బూటూ వేసుకొని వెళ్ళి.. అక్కడ మాంచి కాస్ట్ లీ కారు కనబడగానే 'వాలెట్‌ పార్కింగ్‌ సార్‌' అంటూ కారు తాళాలు అడగటం.. ఇవ్వగానే ఆ కారు తీసుకొని జంప్‌ అయిపోవడం. ఇదే వారు చేసే కామెడీ.

ఇప్పుడు నిజంగా హైదరాబాద్ వంటి నగరాల్లో.. దాదాపు ప్రతీ చిన్నా చితకా రెస్టారెంట్లు.. ప్రముఖ స్వీట్ షాపులు.. అప్‌ టౌన్‌ స్టోర్లు.. అన్నింటిదగ్గర వాలెట్‌ పార్కింగ్‌ ఉంది. కాని ఒక్కోసారి మన కారు తాళాలు అడుగుతున్న ఆ వ్యక్తి నిజంగానే వాలెట్‌ పార్కింగ్ చేసే డ్రైవరా అనే సందేహాలు వచ్చేస్తున్నాయి. అసలు వాలెట్‌ పార్కింగ్‌ చూస్తే చాలు.. ''ఎమేజింగ్‌.. జింగ్‌ జింగ్‌'' అంటూ వీళ్లు కార్లు దొబ్బేసే సీన్లే గుర్తొస్తున్నాయట తెలుగు జనాలకు. చాలామంది కారును వాలెట్‌ వారికి ఇవ్వకుండా తామే సొంతంగా పార్కు చేసుకుంటున్నారు. కొందరైతే జాగ్రత్తగా ఆ డ్రైవర్‌ పార్కు చేసే వరకు వెయిట్‌ చేసి మరీ చూస్తున్నారు. అసలు వాలెట్ పార్కింగ్‌ ఫెసిలిటీ ఉన్న చాలా చాలా పెద్ద పెద్ద హోటళ్ళలో ''వుయ్‌ ఆర్‌ నాట్ రెస్పాన్సిబుల్‌ ఫర్‌ యువర్ కార్‌'' అని రాసి ఉండటంతో.. పార్కింగ్‌ చేయించుకునే కారు ఓనర్లు ఇంకా ఖంగారుపడుతున్నారు.