Begin typing your search above and press return to search.

మా హీరోలకు గుట్కా లపై ఉన్న శ్రద్ధ సినిమాలపై లేదు

By:  Tupaki Desk   |   19 Sep 2022 6:36 AM GMT
మా హీరోలకు గుట్కా లపై ఉన్న శ్రద్ధ సినిమాలపై లేదు
X
బాలీవుడ్‌ లో గత మూడు సంవత్సరాలుగా సాలిడ్ బ్లాక్ బస్టర్‌.. భారీ ఇండస్ట్రీ అన్నట్లుగా నిలిచిన సినిమానే లేదు. ఒకటి రెండు సినిమాలు పర్వాలేదు అన్నట్లుగా వసూళ్లు సాధించినా కూడా బ్రేక్‌ ఈవెన్ కి చాలా దూరంగా ఉండి పోయాయి అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్‌. తెలుగు సినిమా లు ఒక వైపు వందల కోట్ల వసూళ్లు సాధిస్తుంటే హిందీ సినిమాలు మాత్రం దారుణమైన ఫలితాలను చవిచూస్తున్నాయి.

ఒక వైపు ఇండస్ట్రీకి బ్యాక్ టు బ్యాక్‌ డిజాస్టర్స్ పడుతున్నాయి.. భారీ బడ్జెట్‌ సినిమాలు కనీసం ప్రమోషన్ ఖర్చులు వెనక్కు తీసుకు రాలేక పోతున్నాయి. అయినా కూడా బాలీవుడ్‌ హీరోలు ఆ విషయాల గురించి పట్టించుకోవడం లేదు. మంచి సినిమా చేయాలి.. మంచి కంటెంట్‌ తో సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఏ ఒక్కరు కనిపించడం లేదు అంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.

ఈ సమయంలో బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ప్ర‌కాష్ ఝా కూడా బాలీవుడ్‌ హీరోలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇండస్ట్రీలో ఎన్నో విలక్షణ సినిమాలను చేసి మంచి పేరును దక్కించుకున్న దర్శకుడు ప్ర‌కాష్ ఝా తాజాగా బాలీవుడ్‌ హీరోల యొక్క సినిమాల ఎంపిక విధానం.. కొందరు సినిమాలను కమర్సియల్‌ గా చేసి చూస్తున్న విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ప్ర‌కాష్ ఝా మాట్లాడుతూ.. మా బాలీవుడ్‌ హీరోలు సినిమాల కథ విషయమై కాకుండా గుట్కాలకు ఎలా ప్రమోషన్ చేయాలి... గుట్కాల యొక్క సేల్స్ ను ఎలా పెంచాలి అనే విషయమై ఆలోచిస్తున్నారు. అంతే తప్ప సినిమా లు ఎందుకు ఫ్లాప్ అవుతున్నాయి... ప్రేక్షకులు మా నుండి ఏం ఆశిస్తున్నారు అనే విషయాలను పట్టించుకోవడం లేదు అంటూ సీరియస్ కామెంట్స్ చేశాడు.

ఒక హీరో 12 యాడ్స్ చేస్తున్నాడు.. ఒక్కో యాడ్‌ కి పది కోట్ల రూపాయలు పారితోషికం తీసుకుంటున్నాడు. అలాంటి హీరోలను డబ్బు భారీగా పెట్టి కొనుక్కుని మరీ సినిమాలు తీయాల్సిన పరిస్థితి వచ్చిందని ఈయన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

హీరో తో సైన్ చేయించాక కథలు రాసుకుంటున్నారు.. కథలు దొరక్కుంటే రీమేక్ లు అంటున్నారు. అంతే తప్ప మంచి కథలను ఎంపిక చేసుకుని దానికి తగ్గ స్టార్స్ ను చూద్దాం అన్న భావన ఈతరం నిర్మాతల్లో కనిపించడం లేదని.. ఈ తరం ఫిల్మ్‌ మేకర్స్ పూర్తిగా కమర్షియల్‌ అయ్యారంటూ ప్ర‌కాష్ ఝా తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆయన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ వర్గాల వారు ఎలా రియాక్ట్‌ అవుతారో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.