Begin typing your search above and press return to search.

'పుష్ప 3' కోసం కూడా ప్రిప‌రేష‌న్స్ మొద‌ల‌య్యాయా?

By:  Tupaki Desk   |   26 Oct 2022 6:01 PM GMT
పుష్ప 3 కోసం కూడా ప్రిప‌రేష‌న్స్ మొద‌ల‌య్యాయా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన యాక్ష‌న్ డ్రామా `పుష్ప : ది రైజ్‌`. టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకున్న బ‌న్నీ ఈ సినిమాలో ఫ‌స్ట్ టైమ్ ఊర మాస్ పాత్ర‌లో కూలోడిగా న‌టించి స‌రికొత్త మేకోవ‌ర్ తో షాకిచ్చాడు. గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్న‌మైన మేన‌రిజ‌మ్స్‌, ఆహార్యంతో బ‌న్నీ క‌నిపించిన తీరు దేశ వ్యాప్తంగా అన్ని భాష‌ల‌కు చెందిన ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఈ మూవీకి వ‌ర‌ల్డ్ వైడ్ గా మంయి క్రేజ్ ల‌భించ‌డంతో దీనికి సీక్వెల్ గా రానున్న‌`పుష్ప‌2`పై అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

ఈ నేప‌థ్యంలో పార్ట్ 1 కి మించి `పుష్ప 2`ని తెర‌పైకి తీసుకురావాల‌ని ద‌ర్శ‌కుడు సుకుమార్‌ తో పాటు మేక‌ర్స్ కూడా భారీ ప్లాన్స్ చేస్తున్నారు. ఉత్త‌రాదిలోనూ ఈ మూవీకి ఊహించ‌ని విధంగా ఆద‌ర‌ణ ల‌భించ‌డంతో సీక్వెల్ ని మ‌రిన్ని ప్ర‌త్యేక‌త‌ల‌తో తెర‌కెక్కించ‌డానికి రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగా పార్ట్ 2 కోసం బ‌డ్జెట్ ని భారీగా పెంచేసిన మేక‌ర్స్ భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల ఈ మూవీకి సంబంధించిన పూజా కార్య‌క్ర‌మాల‌ని పూర్తి చేసిన చిత్ర బృందం ప్రస్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది.

అంతే కాకుండా రీసెంట్ గా హీరో అల్లు అర్జున్ కు లుక్ టెస్ట్ కు సంబంధించిన ప్ర‌త్యేక ఫొటో షూట్ ని కూడా నిర్వ‌హించారు. త్వ‌ర‌లో సెట్స్ పైకి రానున్న ఈ మూవీకి సంబంధించి రోజుకో వార్త ఆస‌క్తిని రేకెత్తిస్తూ `పుష్ప 2`పై అంచ‌నాల్ని పెంచేస్తోంది. మారేడుమిల్లి లో `పుష్ప‌` కు సంబంధించిన కీల‌క ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రించారు. `పుష్ప 2`ని కూడా అక్క‌డే షూట్ చేయ‌బోతున్నార‌ట‌. అంతే కాకుండా విదేశాల్లోనూ ప‌లు కీల‌క ఘ‌ట్టాలని చిత్రీక‌రించ‌నున్నార‌ని తెలుస్తోంది.

థాయ్ లాండ్ లో బ‌న్నీపై భారీ స్థాయిలో పులి ఫైట్ ని షూట్ చేయ‌డానికి సుకుమార్ ప్లాన్ చేస్తున్నారని కూడా వార్త‌లు వినిపిస్తున్న నేప‌థ్యంలో తాజాగా మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన వార్త బ‌య‌టికి వ‌చ్చింది. ముందు ఒకే భాగంతో ఫినిష్ చేయాల‌నుకున్న సుకుమార్ క‌థ డిమాండ్ మేర‌కు పార్ట్ 2ని కూడా ప్లాన్ చేసి క్లైమాక్స్ ఎండింగ్ లో రివీల్ చేసిన విష‌యం తెలిసిందే. అదే త‌ర‌హాలో ఈ మూవీకి పార్ట్ 3ని కూడా తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి.

`పుష్ప 2` క్లైమాక్స్ లో పార్ట్ 3 కోసం భారీ ట్విస్ట్ ని రివీల్ చేయ‌బోతున్నార‌ట‌. ఇది పార్ట్ 3కి లీడ్ కానుంద‌ని చెబుతున్నారు. ఇది ఎంత వ‌ర‌కు నిజం అన్న‌ది తెలియాలంటే మేక‌ర్స్ నుంచి కీల‌క అప్ డేట్ బ‌య‌టికి రావాల్సిందే. అయితే ఈ వార్త మాత్రం బ‌న్నీ ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషీ చేస్తున్నాట్టుగా తెలుస్తోంది. `పుష్ప‌`ని పాన్ ఇండియా స్థాయిలో తెర‌కెక్కించి సంచ‌ల‌నం సృష్టించిన సుకుమార్ పార్ట్ 2తో మ‌రో లెవెల్ మూవీని అందించ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.