Begin typing your search above and press return to search.

మా ఎలక్షన్స్‌ : మొదటి మ్యానిఫెస్టో వచ్చింది

By:  Tupaki Desk   |   2 Oct 2021 7:34 AM GMT
మా ఎలక్షన్స్‌ : మొదటి మ్యానిఫెస్టో వచ్చింది
X
మూవీ ఆర్టిస్టు అసోషియేషన్‌ ఎన్నికల గడువు సమీపిస్తుంది. పోటీ పడుతున్న వారు అంతా కూడా తమ నామినేషన్‌ ను వేయడం జరిగింది. పోటీ నుండి తప్పుకునే వారు కూడా కొందరు తమ నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. ఇక మా అధ్యక్ష పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు మరియు సీవీఎల్‌ నరసింహారావు లు మ్యానిఫెస్టోలు విడుదల చేయాల్సి ఉండగా మొదటగా సీవీఎల్ మ్యానిఫెస్టో వచ్చింది. మంచు విష్ణు మరియు ప్రకాష్ రాజ్‌ లు ఒకరి మ్యానిఫెస్టో తర్వాత మరొకరు విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఆలస్యం చేస్తున్నారు. ఈ క్రమంలో సీవీఎల్ మ్యానిఫెస్టో వచ్చేసింది. మా లో ఉన్న ఇబ్బందులను పరిష్కరిస్తూ ముందు ముందు ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటూ వెళ్లేలా మా అధ్యక్షుడిగా తాను చేయబోతున్న విధులు అన్నాడు.

సీవీఎల్ మ్యానిఫెస్టోలో.. 2011 లో పాస్ చేసిన రిజల్యూషన్‌ ని సరిగ్గా అమలు చేస్తామంటూ పేర్కొన్నారు. అదే కనుక సరిగ్గా అమలు చేస్తే మా సభ్యులు అందరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. తప్పకుండా ప్రతి ఒక్కరి అవకాశం కోసం ఆ రిజల్యూషన్ ను పటిష్ఠంగా అమలు చేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నాడు. ఈ రిజల్యూషన్ అమలుకు 50 మంది సభ్యులతో ఒక కమిటీని వేయబోతున్నట్లుగా కూడా పేర్కొన్నాడు. ఆ 50 మంది పేర్లను త్వరలో ప్రకటిస్తాను అంటూ సీవీఎల్‌ తెలియజేశారు. ప్రతి ఏడాది మా సభ్యులకు గాను రూ.3 లక్షల రూపాయల హెల్త్‌ ఇన్సురెన్స్ వచ్చేలా ప్రీమియం మా కడుతుంది. వచ్చే జనవరి నుండి ఆ కొత్త హెల్త్‌ ఇన్సురెన్స్ ను అమలు చేస్తాను.

ఆడవాళ్ల కోసం ఆసరా తరహా స్కీమ్ ను 20 ఏళ్ల క్రితం మా పెట్టడం జరిగింది. మళ్లీ ఇప్పుడు ఆ పథకంను రివైన్ చేస్తాము. ఇక ఫిల్మ్‌ నగర్ కల్చరల్‌ క్లబ్‌ లో మా మెంబర్స్ కి అసోషియేట్‌ మెంబర్‌ షిప్ ఇచ్చేలా చర్యలు తీసుకుంటాం. రూ.6 వేలు ఉన్న పెన్షన్‌ ను 10 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంటాం. నవంబర్ నుండి 10 వేలు అందేలా చూస్తామన్నారు. మా సభ్యులు ఎవరైనా ఆకలి బాధతో ఉన్నట్లుగా మాకు సమాచారం అందితే రెండు గంటల్లో వారికి రెండు నెలలకు సరిపడ కిరాణం అందజేస్తామని పేర్కొన్నాడు. ఇంకా మా కోసం సీవీఎల్‌ మ్యానిఫెస్టోలో పలు అంశాలను చెప్పడం జరిగింది.