Begin typing your search above and press return to search.

నితిన్‌ కురిపించిన పవనప్రేమ అద్భుతం

By:  Tupaki Desk   |   3 May 2016 4:21 AM GMT
నితిన్‌ కురిపించిన పవనప్రేమ అద్భుతం
X
పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాన్‌ గురించి నితిన్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. చెప్పిన ప్రతీ సారి కొత్త కబుర్లు చెబుతూ ఉంటాడు. గతంలో 'ఇష్క్‌' సినిమా ఆడియో లాంచ్‌ నాడు పవన్‌ ''తొలిప్రేమ'' సినిమానే తనకు సినిమాల్లోకి రావడానికి ఇన్సిపిరేషన్‌ అంటూ చెప్పుకొచ్చిన నితిన్‌.. అప్పుడు కాస్త స్పీచ్‌ మర్చిపోయానని.. ఇప్పుడు అది కంటిన్యూ చేస్తున్నా అంటూ నవ్వుల పువ్వుల మధ్యన తన మాటలు పలికించాడు.

తను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం పవన్ అంటూ మరోసారి చెప్పుకొచ్చాడు నితిన్‌. ''అసలు సినిమాల్లోకి తొలిప్రేమ ప్రేరణ ద్వారా వస్తే.. నా తొలిసినిమా కోసం కూడా పవన్‌ గారి హెల్ప్‌ తీసుకున్నా. జయం సినిమా ఆడిషన్స్‌ కు వెళితే.. డ్యాన్స్‌ వచ్చా అని అడిగారు. వెంటనే తమ్ముడు.. బద్రి.. సినిమాల్లోని స్టెప్పులు వేసేశా. ఏదన్నా సీన్‌ నేర్చుకొని రమ్మంటే.. తమ్ముడు మూవీలో శకుంతల అక్కియా సీన్‌ దించేశా. అలా పవన్‌ గారి వలనే నాకు తొలి సినిమా వచ్చింది. అది 2002 నాటి మాట. ఇక బీభత్సమైన స్లంప్‌ లో ఉన్నప్పుడు.. ఆయన వస్తేనే 2012లో ఇష్క్ భారీ హిట్టయ్యింది. నాకు సెకండ్ లైఫ్‌ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 2016లో వచ్చారు. సినిమా సూపర్‌ హిట్‌. నాకు ఇన్ని సార్లు లైఫిస్తున్న పవన్‌ గారిక థ్యాంక్స్‌ '' అంటూ నితిన్‌ ముగించాడు.

ఆ తరువాత పవన్‌ మాట్లాడుతూ.. ''నితిన్‌ నన్ను ఇంతగా ప్రేమిస్తాడని.. అభిమానిస్తాడని.. అస్సలు అనుకోలేదు. నాకో తమ్ముడులాంటోడు నితిన్‌'' అన్నాడు. అది సంగతి.