Begin typing your search above and press return to search.

స‌లార్ లో ఆఫ‌ర్ నిజం కాద‌న్న హాటీ

By:  Tupaki Desk   |   9 Feb 2022 3:55 AM GMT
స‌లార్ లో ఆఫ‌ర్ నిజం కాద‌న్న హాటీ
X
హిట్టు ఏదైనా డిసైడ్ చేస్తుంది. ఒక్కోసారి స్టార్ల‌కు అవ‌కాశాల రేంజ్ అమాంతం మారిపోతుంది. న‌టన‌లో నిరూపించుకుంటే ద‌ర్శ‌క‌నిర్మాత‌ల క‌న్ను ప‌డుతుంది. ఇప్పుడు ఖిలాడీ లో న‌టిస్తున్న ఇద్ద‌రు భామ‌ల‌పైనా ఇండ‌స్ట్రీ దృష్టి ప‌డింది. అందానికి అందం క‌వ్వింత‌తో చెల‌రేగిపోతున్న మీనాక్షి చౌద‌రి- డింపుల్ హ‌యాథీల‌కు వ‌రుస ఆఫ‌ర్లు ఖాయ‌మ‌ని భావిస్తున్నారు.

తాజా ఇంట‌ర్వ్యూల్లో ఆ ఇద్ద‌రూ చాలా విష‌యాల‌పై ముచ్చ‌ట్లాడుతున్నారు. మిస్ ఇండియా కంటెస్టెంట్.. యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి త‌న మూవీ `ఖిలాడీ`ని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తోంది. కోస్టార్ డింపుల్ తో క‌లిసి గొప్ప‌గా ప్ర‌చారం చేస్తోంది ఈ బ్యూటీ. ఇంట‌ర్వ్యూల్లో చాలా సింపుల్ గా మాట్లాడుతూ అంద‌రి మ‌న‌సుల్ని దోచేస్తోంది మీనాక్షి. లిప్ కిస్ సీన్ గురించి ఆమె మాట్లాడుతూ.. స్క్రిప్ట్ - పాత్ర డిమాండ్ చేసినప్పుడు అలాంటి సన్నివేశాలలో చేయ‌డానికి తనకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అంత‌కుమించి టాలీవుడ్ లో చక్కర్లు కొడుతున్న అతి పెద్ద రూమర్ పై క్లారిటీ ఇచ్చింది.

మీనాక్షి ఒడ్డు పొడుగు అందం క‌వ్వింపు ప్ర‌తిదీ యూత్ కి క‌నెక్ట‌య్యాయి. త‌ను ప్రభాస్ - దర్శకుడు ప్రశాంత్ నీల్ లను ఎంతగానో ఆకట్టుకుంద‌ని త‌దుప‌రి స‌లార్ లో ఒక ప్రత్యేక పాత్ర కోసం ఆమెను తీసుకున్నారని ఒక పుకారు వచ్చింది. అయితే ఎలాంటి పాత్ర కోసం తనను ఎవ‌రూ సంప్రదించలేదని మీనాక్షి చౌద‌రి స్పష్టం చేసింది. శృతి హాసన్ మాత్రమే స‌లార్ లో సోలో హీరోయిన్‌. అయితే ఇతర భామ‌ల‌కు ఆఫ‌ర్లు ఉన్నా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

ఖిలాడీతో నిరూపించుకుంటే భామ‌ల‌కు స‌లార్ లాంటి ప్రాజెక్టులో అవ‌కాశం ద‌క్కినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. అందం ఉంది క‌వ్వింత ఉంది.. చ‌క్క‌ని చిరున‌వ్వు ఉంది. ప్ర‌భాస్ కి ధీటైన ఒడ్డు పొడుగు ఉన్న భామ మీనాక్షి. ఇక లిప్ లాక్ లు ఘాటైన స‌న్నివేశాల్లో జీవించేందుకు త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని చెప్పి హెడ్ ట‌ర్న‌ర్ గా నిలిచింది. అందుకే

స‌లార్ రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న నేప‌థ్యంలో అంద‌గ‌త్తెల‌కు ప్ర‌భాస్ ఆఫ‌ర్ ఇవ్వకుండా ఉంటారా? అంటూ గుస‌గుస వైర‌ల్ అవుతోంది.