Begin typing your search above and press return to search.
సప్తగిరి రచ్చ రంబోలా
By: Tupaki Desk | 5 Nov 2017 4:37 AM GMTకమెడియన్లు ఒక్కొక్కరుగా హీరోలైపోతున్నారు టాలీవుడ్లో. సప్తగిరి సైతం గత ఏడాది ‘సప్తగిరి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో హీరో అయ్యాడు. ఆ సినిమా టాక్ ఏమంత గొప్పగా లేకపోయినా.. వసూళ్లు మాత్రం పర్వాలేదనిపించాయి. నిర్మాత సేఫ్ అయ్యాడు. ఆ సినిమాను నిర్మించిన రవికిరణే ఇప్పుడు సప్తగిరి హీరోగా రెండో సినిమా కూడా తీశాడు. అదే.. సప్తగిరి ఎల్ఎల్‌బీ. ఈ సినిమా టీజర్ లాంచ్ చేశారు.
తొలి సినిమాతో పోలిస్తే రెండో సినిమాలో సప్తగిరి హీరోయిజం మరింత ఎక్కువగానే ఉండబోతోందని అర్థమవుతోంది. మాస్ హీరోలాగా డ్యాన్సులు.. ఫైట్లతో రెచ్చిపోయాడు సప్తగిరి. అతడి ఎనర్జీ చూస్తే షాకవ్వాల్సిందే. కాకపోతే సప్తగిరికి ఇవి ఏమాత్రం సూటవుతాయి.. ఇలాంటి విన్యాసాల్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారన్నది సందేహం. టీజర్లో చూపించిన ఒక కామెడీ పంచ్ రొటీన్ గానే అనిపించినా నవ్వించింది.
హీరో తన గురించి సప్తగిరి ఎల్‌ఎల్‌బీ అని పరిచయం చేసుకుంటే.. ‘‘అప్పీ అప్పీల్ బదులు యాపిల్ అని రాశావు. ప్రాసిక్యూషన్ బదులు ప్రాస్టిట్యూషన్ అని రాశావు’’ అంటూ అతడి గాలి తీసేస్తాడు సీనియర్ లాయర్. ఈ డైలాగ్ మినహాయిస్తే సప్తగిరి ఫైటింగ్.. డ్యాన్సింగ్ టాలెంట్స్ చూపించడానికే టీజర్లో మిగతా సమయమంతా కేటాయించారు. ఈ చిత్రంతో చరణ్ లక్కాకుల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పరుచూరి సోదరులు ఈ చిత్రానికి రచన చేయడం విశేషం. టైటిల్ చూసి ఇది బాలీవుడ్ మూవీ ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’కి రీమేకేమో అనుకున్నారు కానీ.. అలాంటిదేమీ లేదని టీజర్ చూస్తే స్పష్టమైంది.