Begin typing your search above and press return to search.

వీకెండ్ కల్లా సరైనోడు అంత లాగేస్తాడా?

By:  Tupaki Desk   |   27 April 2016 5:30 PM GMT
వీకెండ్ కల్లా సరైనోడు అంత లాగేస్తాడా?
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సరైనోడు.. సమ్మర్ బ్లాక్ బస్టర్ దిశగా పరుగులు పెడుతోంది. చాలా రోజుల తర్వాత మెగాభిమానుల ఆకలి తీర్చిన మూవీ సరైనోడు. ఈ ఏడాది ఇప్పటివరకూ రిలీజ్ అయిన చిత్రాల్లో.. హైయెస్ట్ గ్రాసర్ గా సరైనోడు నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటున్నారు ఇండస్ట్రీ జనాలు. ఇందుకు వీక్ డేస్ లో కూడా సరైనోడు రాబడుతున్న కలెక్షన్సే నిదర్శనం.

మొదటి వీకెండ్ వరకూ స్టార్ హీరోల సినిమాలకి కలెక్షన్స్ రావడం మామూలే. కానీ సరైనోడు మాత్రం వారం మధ్యలో కూడా జోరు తగ్గించడం లేదు. మంగళవారం రోజున 3.4 కోట్ల షేర్ వచ్చిందంటే.. సరైనోడు ఎంత స్వింగ్ లో ఉన్నాడో అర్ధమవుతుంది. వీకెండ్స్ లోనే 30.3 కోట్ల షేర్ రాబట్టాడు సరైనోడు. ఇప్పుడు మిగిలిన ఐదు రోజుల్లో ఎంత కలెక్ట్ చేస్తాడనే లెక్కలు మొదలైపోయాయి. ఇప్పుడున్న స్పీడ్ చూస్తుంటే.. కనీసం 14-15 కోట్లు రాబట్టడం ఖాయమైపోయింది.

అంటే సరైనోడు మొదటి వారంలోనే 44 నుంచి 45 కోట్లు రాబట్టడం పక్కా అయిపోయింది. వీకెండ్స్ లో ప్రదర్శించిన సంఖ్యలోనే థియేటర్లు నిలబడ్డాయంటే.. ఇదే ఊపు వచ్చే వారం కూడా కంటిన్యూ అవడం పక్కా అయిపోయింది. బన్నీ తర్వాత వచ్చే భారీ తెలుగు సినిమా మహేష్ బ్రహ్మోత్సవం మాత్రమే. ఈలోపు వేరే సినిమా రిలీజ్ అయ్యే గ్యాప్ లేదు. అప్పటివరకూ సరైనోడు జోరు కొనసాగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. తొలివారంలోనే 45 కోట్లకు ఫిగర్ చేరుకుంటే.. రెండో వారంలో మరో 20 కోట్లు తేలిగ్గానే వస్తాయి. అంటే.. సరైనోడు లెక్క 65 నుంచి 70 కోట్ల మధ్య ఆగే ఛాన్సులు ఉన్నాయి. ఇదీ సరైన లెక్క.