Begin typing your search above and press return to search.
సంపత్ నంది గురించి షాకింగ్ సీక్రెట్
By: Tupaki Desk | 8 Dec 2015 3:30 PM GMTసంపత్ నంది పేరు వినగానే చాలామందికి అయ్యో పాపం అనిపిస్తుంది. ‘గబ్బర్ సింగ్-2’ కోసం రెండేళ్లు కష్టపడి.. పవన్ ను మెప్పించలేక బయటికి వచ్చేసిన ఈ దర్శకుడిపై అప్పట్లో చాలామంది జాలిపడ్డారు. కానీ అతనదేమీ పట్టించుకోకుండా వెంటనే రవితేజతో ‘బెంగాల్ టైగర్’ మొదలుపెట్టాడు. శరవేగంగా సినిమా పూర్తి చేసి.. మంచి క్రేజ్ మధ్య సినిమా రిలీజ్ చేయిస్తున్నాడు. ఐతే గబ్బర్ సింగ్-2 విషయంలో బాగా డిజప్పాయింట్ అయి ఉంటారు కదా.. ఇలాంటి సమయంలో ఎవరైనా డిప్రెషన్లోకి వెళ్లిపోతారు కదా అంటే.. తన జీవితంలో ఇంతకంటే చేదు అనుభవాలు చాలా ఉన్నాయంటూ తన గురించి ఇండస్ట్రీలో చాలామందికి తెలియని సీక్రెట్ ఒకటి వెల్లడించాడు సంపత్.
సాక్షి టీవీలో బాగా ఫేమస్ అయిన రామ్ అన్నయ్య తెలుసు కదా. ఆయన ఇంతకుముందు దర్శకుడిగా ‘టాస్’ అనే సినిమా తీసిన సంగతి గుర్తుండే ఉంటుంది. అందులో ఉపేంద్ర - రాజా - ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంపత్ రైటర్ గా పని చేశాడట. ఆ సమయంలో సంపత్ పనితీరు ఉపేంద్రకు బాగా నచ్చి.. తనను డైరెక్టరుగా ఇంట్రడ్యూస్ చేస్తానంటూ బెంగళూరుకు తీసుకెళ్లాడట. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా మొదలై.. 95 శాతం పూర్తయ్యాక విడుదల కాకుండా ఆగిపోయిందట. ‘‘ఉపేంద్ర లాంటి పెద్ద స్టార్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యే అవకాశం వచ్చిందని సంతోషించా. కానీ ఆ సినిమా దాదాపుగా పూర్తి కావచ్చిన దశలో ఆగిపోయింది. రెండేళ్ల పాటు నిర్మాతల ఆఫీస్ లోనే గడిపాను. యూనిట్ లోంచి అందరూ వెళ్లిపోయినా నేనొక్కడినే సినిమా మీద ఆశతో ఉన్నా. కానీ సినిమా బయటికి రాలేదు. నేను ప్రేమించిన అమ్మాయితో అప్పటికే నాకు పెళ్లి ఫిక్సయింది. కానీ నా సినిమా అలా అయిపోవడంతో అమ్మాయి తల్లిదండ్రులు నాకు చాలా ప్రశ్నలు వేశారు. వాళ్లను కన్విన్స్ చేయడానికి ఎంతో కష్టపడ్డాను. రచయితగానూ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. ఇవన్నీ దాటి వచ్చాక ఎదురయ్యే ఏ కష్టాన్నయినా తట్టుకునే గుండె నిబ్బరం నాకు వచ్చింది’’ అని సంపత్ చెప్పాడు.