Begin typing your search above and press return to search.

మ్యూజిక్ ఆల్బంలో పెళ్ళిచూపులు హీరో

By:  Tupaki Desk   |   4 Aug 2017 8:24 AM GMT
మ్యూజిక్ ఆల్బంలో పెళ్ళిచూపులు హీరో
X
కిందటి ఏడాది వచ్చిన పెళ్లి చూపులు సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయింది మనకు తెలుసు. ముఖ్యంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఈ సినిమా తరువాత బాగ బిజీ అయ్యారు. హీరోయిన్ రీతు వర్మ తెలుగులోనూ అటు తమిళ్ లోనూ ఛాన్స్ లు కొట్టేసింది. ఇక హీరో విజయ్ దేవేరకొండ మరో నవ హీరోగా తెలుగు సినిమాలో ప్రయాణం మొదలుపెట్టాడు. పెళ్లి చూపులు సినిమా వెంటనే వరుస పెట్టి షూటింగ్లు చేస్తున్నాడు.

ఈ మధ్య తన రాబోతున్న కొత్త సినిమా అర్జున్ రెడ్డి టీజర్ కూడా విడుదలై మంచి స్పందన తెచ్చుకుంది. ఈ సినిమా కాకుండా మరో లవ్ స్టోరీకు సై అంటున్నాడు ఈ యువ హీరో. లావణ్య త్రిపాఠీ హీరోయిన్ గా నటింకాబోతున్న ఈ రొమాంటిక్ కామిడీ సినిమాను టాలీవుడ్ పెద్ద ప్రొడక్షన్ సంస్థలలో ఒకటైన గీత ఆర్ట్స్ వాళ్ళు నిర్మిస్తున్నారు. ఈ సినిమాను పరశురాం డైరక్ట్ చేస్తున్నాడు. ఈ వరుస ప్రేమ కథలు పక్కన పెడితే మరో క్రేజీ ప్రాజెక్టులో విజయ్ పని చేయబోతున్నాడు. బాలీవుడ్ మ్యూజిక్ వీడియో కంపెనీ టి-సిరీస్ విజయ్ దేవరకొండను పెట్టి ఒక మ్యూజిక్ ఆల్బం చేయబోతుంది. టి-సిరీస్ ఇప్పటికే చాలా మంది బిగ్ స్టార్స్ తో మ్యూజిక్ వీడియోలు చేసింది. ఇప్పుడు విజయ్ దేవరకొండ ను లీడ్ యాక్టర్ గా పెట్టి తెలుగు - హింది బాషలలో ఒక మ్యూజిక్ వీడియోను విడుదల చేయబోతుంది. ఈ మ్యూజిక్ ఆల్బం కు మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ కంపోజ్ చేయబోతున్నాడు. అర్మాన్ మాలిక్ ఈ పాటను పాడనున్నాడు.

ఈ మ్యూజిక్ వీడియోలో విజయ్ తో పాటుగా ఒక బెంగాలీ నటి కూడా చేయబోతుంది అని చెబుతున్నారు. తెలుగులో ఇటువంటి ట్రెండ్ ఇంకా మన హీరోలు అలవాటు పడలేదు కానీ హిందీలో ఈ ట్రెండ్ ఎప్పటి నుండో నడుస్తుంది. విజయ్ ఈ మ్యూజిక్ వీడియొ కోసం చాల ఉత్కంఠతతో ఎదురుచూస్తున్నాడుట. ఇక సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి' అనే సినిమా ఈ నెల ఆగష్టు 25 న విడుదలకాబోతుంది. ఈ సినిమాలో విజయ్ దేవేరకొండ కు జంటగా షాలిని హీరోయిన్ గా నటిస్తోంది. ​