Begin typing your search above and press return to search.
దీపిక పదుకొణే ఎంట్రీతో థర్డ్ వరల్డ్ వార్ మొదలవుతుందా!
By: Tupaki Desk | 9 Feb 2022 6:52 AM GMTపాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో `ప్రాజెక్ట్ -కె` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా యూనిట్ హైదరాబాద్ లో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసింది. రామోజీ ఫిలిం సిటీలో ఏక ధాటిగా షూటింగ్ జరపడానికి యూనిట్ సర్వం సిద్దం చేస్తోంది.
భారీ తారగణంతో తెరకెక్కుతోన్న చిత్రం కావడంతో సెక్యురిటీ పరంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో హీరోయిన్ గా నటిస్తోన్న దీపిక పదుకొణే ఈ షెడ్యూల్ పాల్గొటుంది. దీనిలో భాగంగా బ్యూటీ హైదరాబాద్ ప్లైట్ ఎక్కింది.
10 కోట్లు పారితోషికం ఇచ్చి మరీ దీపికని లాక్ చేసారు. దీపిక హైదరాబాద్ వస్తుందంటే ఆమెతో పాటు బృందం కూడా ఉంటుంది. దీంతో దీపిక సహా టీమ్ కి ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఓ పెద్ద స్టార్ హోటల్ బస ఏర్పాటుతో పాటు...కార్వాన్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.
దీపిక ఈ సినిమా కోసం ఎన్ని రోజులు డేట్లు కేటాయిందన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక `ప్రాజెక్ట్-కె` చాలా యూనిక్ సబ్జెక్ట్. ఊహాత్మక మూడవ ప్రపంచం యుద్దం నేపథ్యంతో తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తిగా ఇమేజినేటెడ్ వార్ గా చెప్పొచ్చు. ఇప్పటికే రెండు ప్రపంచ యుద్దాలు జరిగాయి. థర్డ్ వరల్డ్ వార్ ని దర్శకుడు నాగ్ అశ్విన్ ముందు తన స్ర్కిప్ట్ రూపంలో డిజైన్ చేసి పెట్టుకున్నారు.
ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హై -ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ ప్రియులకు ప్రత్యేకమైన అనుభూతిని కల్గిస్తాయని టీమ్ ధీమా వ్యక్తం చేస్తోంది. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో చిత్రాన్ని ప్రతి ష్టాత్మకంగా అశ్వినీదత్ నిర్మిస్తున్నారు.
ఇందులో బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ కూడా కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. తెలుగు..హిందీ భాషల్లో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అలాగే సినిమా కోసం విదేశీ టెక్నీషియన్లను నాగ్ అశ్విన్ రంగంలోకి దించారు. వార్ సన్నివేశాల డిజైన్ విషయంలో విదేశీ రైటర్ల సహకారం తీసుకున్నట్లు తెలుస్తోంది.