సూపర్ హిట్ చిన్న సినిమాకు ప్రీక్వెల్..!
ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 12th ఫెయిల్ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు
By: Tupaki Desk | 30 Sep 2024 6:30 AM GMTఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవిత కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 12th ఫెయిల్ మూవీ ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్న సినిమాగా రూపొంది పాన్ ఇండియా స్థాయిలో భారీ వసూళ్లు రాబట్టింది. అంతే కాకుండా ఓటీటీ లోనూ సంచలన వసూళ్లు సాధించి రికార్డ్ సృష్టించింది. ప్రముఖ ఓటీటీ ల్లో ఈ సినిమా సాధించిన వ్యూస్ రికార్డ్ బ్రేకింగ్ గా నిలిచిన విషయం తెల్సిందే. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇంకా ఏదో ఒక చోట వార్తల్లో నిలుస్తూనే ఉంది. తాజాగా ఈ సినిమాకు ప్రీక్వెల్ రాబోతుందనే వార్తలు వస్తున్నాయి.
12th ఫెయిల్ సినిమాకు ప్రతిష్టాత్మక ఐఫా అవార్డ్ దక్కింది. ఆ అవార్డు వేడుకల్లో నిర్మాత విధు వినోద్ చోప్రా మాట్లాడుతూ ప్రీక్వెల్ ను ప్రకటించారు. ప్రీక్వెల్ టైటిల్ ను సైతం అధికారికంగా నిర్మాత రివీల్ చేశారు. జీరో సే షురువాత్ అనే టైటిల్ తో కథ ను ఇప్పటికే రెడీ చేసినట్లుగా ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలను చెప్తామని ఆయన అన్నారు. ఈ మధ్య కాలంలో సీక్వెల్స్ మాత్రమే కాకుండా ప్రీక్వెల్స్ సైతం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ముందు జరిగిన కథ తో వస్తే దాన్ని ప్రీక్వెల్ అంటారు. 12th ఫెయిల్ సినిమాలో చూపించిన కథ కు ముందు ఏం జరిగింది అనేది జీరో సే షురువాత్ లో చూపింనున్నారు.
నిర్మాత విధు వినోద్ చోప్రా చెప్పిన విషయాల అనుసారం మొదటి పార్ట్ లో ఎవరైతే కనిపించారో వారే ప్రీక్వెల్ లో కనిపించబోతున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని, త్వరలోనే సినిమా షూటింగ్ ను ప్రారంభిస్తామని అన్నారు. డిసెంబర్ 13న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సూపర్ హిట్ సినిమా కి సీక్వెల్ లేదా ప్రీక్వెల్ అనగానే అంచనాలు భారీగా ఉంటాయి. ఇక ఈ సినిమా కి సైతం సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. పైగా సినిమా కి ప్రీక్వెల్ అంటూ ప్రకటించిన నేపథ్యంలో అందరిలోనూ ఆసక్తి అప్పుడే మొదలైంది.
12th ఫెయిల్ సినిమాలో మనోజ్ కుమార్ శర్మ పాత్ర ను విక్రాంత్ మాస్సే పోషించారు. ఇంకా కీలక పాత్రల్లో మేధా శంకర్, అనంత్ వి జోషి, అన్షుమాన్ పుష్కర్, సరితా జోషి కీలక పాత్రల్లో నటించారు. విధు వినోద్ చోప్రా స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాకు శంతను మొయిత్రా సంగీతం అందించారు. గత ఏడాది అక్టోబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు రూ.70 కోట్ల వసూళ్లను నమోదు చేసింది. 20 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా 70 కోట్ల వసూళ్లు సాధించడంతో పాటు, ఓటీటీ, శాటిలైట్ రైట్స్ ద్వారా భారీ మొత్తం దక్కించుకుంది. ఇప్పుడు ప్రీక్వెల్ ను కాస్త ఎక్కువ బడ్జెట్ తో నిర్మించే అవకాశాలు ఉన్నాయి.