అప్పుడు భయపడేవాడు..ఇప్పుడు భయపెడుతున్నాడు!
అతనే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈయన నేరుగా భన్సాలీ గురువు విధు వినోద్ చోప్రానే రివీల్ చేసారు.
By: Tupaki Desk | 24 Aug 2024 8:30 PM GMTటాలీవుడ్ డైరెక్టర్లలో నటీటనులపై అరిచే డైరెక్టర్ ఎవరు? అంటే ఠక్కున తేజ పేరు గుర్తొస్తుంది. దర్శకు డిగా కెప్టెన్ కుర్చీ ఎక్కాడంటే తేజ నైజం వేరు. ది బెస్ట్ ఇవ్వాలంటూ నటీనుటల్ని తన దారిలోకి తెచ్చుకుని మరీ ఔట్ ఫుట్ తీసుకుంటాడు. ఆ క్షణం నటులు ఇబ్బంది పడినా? తర్వాత వాళ్లే తేజ వల్లే అంత గొప్పగా నటించామని గర్వంగా చెబుతారు. ఈ మధ్య నే హరీష్ శంకర్ కూడా సెట్ లో కోపంతో ఊగిపోతాడు? అన్న సంగతి బయటకు వచ్చింది.
'మిస్టర్ బచ్చన్' సినిమా ప్రచారంలో భాగంగా హరీష్ శంకర్ సెట్లో ఎలా ఉంటాడో? స్కిట్లు వేసి చూపించడంతో సంగతి జనాలకు అర్దమైంది. మరి బాలీవుడ్ లో కూడా ఇలాంటి డైరెక్టర్ ఉన్నారా? అంటే తేజ..హరీష్ ని మించి అరుపులు..కేకలతో పనిచేయించుకునే దర్శకుడు ఒకరున్నారని తెలుస్తోంది. అతనే కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఈయన నేరుగా భన్సాలీ గురువు విధు వినోద్ చోప్రానే రివీల్ చేసారు.
సంజయ్ కి కోపం వస్తే మామూలుగా ఉండదట. చుట్టూ ఉన్న వారిపై ఫైర్ అయిపోతాడుట. ఎదురుగా ఏముందో కూడా చూడకుండా విసిరేస్తాడుట. విధు వినోద్ తెరకెక్కించిన '1942 ఏలవ్ స్టోరీ' సినిమాకి సహాయ దర్శకుడిగా సంజయ్ లీలాభన్సాలీ పనిచేసారుట. ఆ సమయంలో ట్యాలెంట్ గుర్తించి వెన్నుతట్టి ప్రోత్సహించాను. 'అప్పుడు అతడి పేరు సంజయ్ భన్సాలీ..ఇప్పుడు మధ్యలో లీల వచ్చి చేరింది.
అప్పట్లో ఎంతో సౌమ్యంగా..నెమ్మదిగా ఉండేవాడు. మాధురీ దీక్షిత్ మాట్లాడలంటే భయపడేవాడు. ఇప్పుడు ఏకంగా హీరోయిన్లు అందర్నీ సెట్ లో భయపెడుతున్నాడు..బెదిరించి పనిచేయిం చుకుంటున్నాడు. సెట్ లో కొన్ని సందర్భాల్లో కోపం రావడం సహజమే. చేసిన సన్నివేశాన్నే మళ్లీ మళ్లీ రీటేక్ లు తీసుకోవడం అన్నది ఏ దర్శకుడికైనా ఇబ్బందే. ఆ సమయంలో కోపం సహజమే' అన్నారు.