పోకిరిని ప్రేమించిన విద్యాబాలన్!
అమ్మాయిలంతా పొకిరిలినే ప్రేమిస్తారని చాలా సినిమాల్లో డైలాగులున్నాయి.
By: Tupaki Desk | 13 April 2024 9:26 AM GMTఅమ్మాయిలంతా పొకిరిలినే ప్రేమిస్తారని చాలా సినిమాల్లో డైలాగులున్నాయి. వార్తా పత్రికల్లోనూ..టీవీల్లోనూ ప్రేమ వైఫల్యమైన తర్వాత వేసే కథనాల్లోనూ ఇలాంటి పొకిరి కథలెన్నో తెరపైకి వచ్చిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా బాలీవుడ్ నటి కూడా అలాంటి పొకిరినే తెలియక ప్రేమించిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంతవరకూ ఎక్కడా తన ప్రేమ కహానీలు పంచుకోని విద్యాబాలన్ తొలిసారి మనసులో మాటలు బయట పెట్టింది. టీనేజ్ లో ఏది ప్రేమనో.... ఏది అట్రాక్షనో తెలియక ప్రేమ అనుకుని ముందుకు వెళ్తుంటారు.
కొంత కాలానాకి ఆసక్తి తగ్గిపోయి బ్రేకప్ చెప్పుకుంటారు. ఇలా నేను కూడా బురిడి కొట్టిన దాన్నే అంటూ తెలిపింది అమ్మడు. కాలేజీలో ఉన్నప్పుడు మొదటిసారి ఓ కుర్రాడికి మనసిచ్చిందిట. అయితే కొద్ది రోజులకే అతడు పొకిని అని తెలియడంతో దూరమైందిట. మళ్లీ ఆ కుర్రాడు ప్రేమిలకు రోజున తారసపడ్డాడుట. విద్యాబాలన్ తారస పడిన ఆసందర్భంలో ఆ ప్రేమికుడు తన మాజీ ప్రేయసితో డేటింగ్ కి వెళ్తున్నానని చెప్పాడుట. అది విని విద్యాబాలన్ కి మైండ్ బ్లాక్ అయిందిట. మగాళ్లు ఇలా ఉంటారా? అని ఒక్కసారిగా ఆలోచన చేసిందిట.
ఇలాంటి వాడిని ప్రేమించానా? అని ఎంతో బాధపడిందిట. అయితే ఆ లవ్ మరీ అంత సీరియస్ కాదంటోంది. గాఢంగా ప్రేమించింది మాత్రం సిద్దార్ధ్ నే..అతన్నే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. మొత్తానికి విద్యాబాలన్ కెరీర్ లో కూడా ప్రేమ కహానీ లు ఉన్నాయని తొలిసారి ఓపెన్ అయింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక అమ్మడి కెరీర్ సంగతి చూస్తే విద్యాబాలన్ కి సరైన సక్సస్ పడి చాలా కాలమవుతోంది.
సినిమాలైతే చేస్తుంది గానీ అవి అంచనాలు అందుకోవడం లేదు. మూడేళ్లగా సక్సెస్ చూడని నాయిక. ప్రస్తుతం `డు ఔర్...డూ ప్యార్` అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే `భూల్ భులయ్య-3` లో కూడా ఎంపికైంది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ తో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఆ సినిమా వైఫల్యమో? విద్యాబాలన్ వయసు కారణమో తెలియదు గానీ ఇక్కడ అవకాశాలు రాలేదు. ఆమె కూడా అంత సీరియస్ గా ప్రయత్నించింది లేదు.