Begin typing your search above and press return to search.

విడుదల 2 ట్రైలర్… వెట్రిమారన్ మరో కల్ట్ కంటెంట్

తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ‘విడుదల 2’ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఒక కార్మికుడిగా మొదలైన పెరుమాళ్ ప్రయాణం తిరుగుబాటుదారుడిగా ఎలా మారిందనేది ట్రైలర్ లో చూపించారు.

By:  Tupaki Desk   |   8 Dec 2024 6:56 AM GMT
విడుదల 2 ట్రైలర్… వెట్రిమారన్ మరో కల్ట్ కంటెంట్
X

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అతను చెప్పే కథలు, సినిమాలే వెట్రిమారన్ స్టాండర్డ్స్ ఏంటనేది అందరికి అర్ధమయ్యేలా చేశాయి. అతని నుంచి సినిమా వస్తుందంటేనే కోలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. స్టార్ హీరోలు అందరూ వెట్రిమారన్ తో వర్క్ చేయడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అయితే ఆయన మాత్రం కథకి సరిపోయే యాక్టర్స్ తోనే సినిమాలు చేస్తారు.

అందుకే అతనికి ప్రత్యేకమైన యునిక్ ఇమేజ్ ఉంది. సూరి, విజయ్ సేతుపతి కాంబినేషన్ లో గత ఏడాది ‘విడుదల 1’ సినిమాతో వెట్రిమారన్ ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. కమెడియన్ గా సక్సెస్ అయిన సూరిని ఈ చిత్రంలో కంప్లీట్ సీరియస్ రోల్ లో హీరోగా తెరపై చూపించాడు. ఈ సినిమాతో అతని ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. విడుదలై 1లో సూరి కథని తెరపై ఆవిష్కరించిన వెట్రిమారన్ విడుదల 2లో పెరుమాళ్ జర్నీని ప్రెజెంట్ చేశాడు.

అసలు పెరుమాళ్ పోరాటవీరుడిగా ఎలా మారాడు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటాలు, ఈ క్రమంలో వెనుకబడిన వర్గాల కోసం ఆయన చేసిన యుద్ధం మొత్తం ‘విడుదల 2’లో చెప్పారు. ఇప్పటికే తమిళంలో రిలీజ్ అయిన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ ‘విడుదల 2’ ట్రైలర్ ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఒక కార్మికుడిగా మొదలైన పెరుమాళ్ ప్రయాణం తిరుగుబాటుదారుడిగా ఎలా మారిందనేది ట్రైలర్ లో చూపించారు. విజయ్ సేతుపతికి ఇలాంటి క్యారెక్టర్స్ పడితే అతని నటవిశ్వరూపం చూపిస్తాడు.

ఇప్పటికే ఈ ఏడాది ‘మహారాజ’ సినిమాతో విజయ్ సేతుపతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ రీసెంట్ గా చైనాలో రిలీజ్ అయ్యి కోట్లు కలెక్ట్ చేస్తోంది. ఇప్పుడు ‘విడుదల 2’ కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది. పెరుమాళ్ లైఫ్ జర్నీ, అతన్ని పట్టుకోవడానికి సూరి చేసిన ప్రయత్నం మధ్యలో ఈ కథ ఉండబోతోందని ట్రైలర్ బట్టి అర్ధమవుతోంది. మంజు వారియర్ క్యారెక్టర్ కూడా ఈ చిత్రంలో పెరుమాళ్ వైఫ్ గా పవర్ ఫుల్ గానే ఉండబోతోందని తెలుస్తోంది.

మరి వెట్రిమారన్ ఈ సినిమాతో ప్రేక్షకులని ఏ మేరకు మెప్పిస్తాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తన ప్రతి సినిమాలలో బడుగు బలహీన వర్గాల పోరాటాలని వెట్రిమారన్ చూపిస్తూ ఉంటాడు. ఈ విడుదల 2 అలాంటి ఓ ఆసక్తికరమైన కథతో డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకివస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన తెలుగు ట్రైలర్ ఎండ్ లో సిద్ధాంతం లేని నాయకులే అభిమానులని సృష్టిస్తారు… అది అభివృద్ధికి మార్గం అవదు అనే డైలాగ్ చాలా పవర్ ఫుల్ గా ప్రెజెంట్ ట్రెండ్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉందనే మాట వినిపిస్తోంది. తెలుగు, తమిళ్ భాషలలో ఏకకాలంలో ఈ మూవీ రిలీజ్ అవుతోంది.