Begin typing your search above and press return to search.

వెట్రిమారన్ 'విడుదల 2'… సేతుపతి స్టన్నింగ్ లుక్

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.

By:  Tupaki Desk   |   17 July 2024 8:05 AM GMT
వెట్రిమారన్ విడుదల 2… సేతుపతి స్టన్నింగ్ లుక్
X

మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు. విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా తన ఇమేజ్ పెంచుకుంటున్నారు. తాజాగా మహారాజ సినిమాతో విజయ్ సేతుపతి ప్రేక్షకుల ముందుకొచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కి 100 కోట్లకి పైగా కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే వెట్రిమారన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి విడుదల మూవీ చేస్తున్నాడు.


వెట్రిమారన్ అంటే కల్ట్ స్టోరీస్ గుర్తుకొస్తాయి. తమిళంలో వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న దర్శకులలో వెట్రిమారన్ ఒకరు. అతని కథలు అన్ని నిజ జీవితానికి దగ్గరగా రియలిస్టిక్ సంఘటనల స్ఫూర్తితోనే ఉంటాయి. అందుకే ఎక్కువగా పబ్లిక్ కనెక్ట్ అవుతారు. తమిళ్ ఆడియన్స్ అయితే వెట్రిమారన్ సినిమాలని బ్లాక్ బస్టర్ చేస్తూ ఉంటారు. స్టార్స్ కోసం వెట్రిమారన్ ఎప్పుడు ప్రయత్నం చేయరు.

తన సినిమాలలో క్యారెక్టర్స్ కి ఎవరైతే సరిపోతారో వారితోనే మూవీస్ చేస్తూ ఉంటారు. వెట్రిమారన్ నుంచి చివరిగా విడుదల పార్ట్ 1 వచ్చి సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో స్టార్ కమెడియన్ సూరి లీడ్ రోల్ లో నటించారు. అతను కానిస్టేబుల్ గా చాలా సీరియస్ పాత్రని ఈ చిత్రంలో చేసాడు. మూవీ సూపర్ హిట్ అయ్యింది. సూరికి కూడా నటుడిగా ఈ మూవీ మంచి ఇమేజ్ తీసుకొచ్చింది. విడుదల పార్ట్ 1లో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు.

విడుదల 2 చిత్రంలో విజయ్ సేతుపతిని కూడా లీడ్ రోల్ గా వెట్రిమారన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి క్యారెక్టర్ కి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ చాలా బలంగా ఉంటాయని టాక్. తాజాగా విడుదల 1 నుంచి విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ రివీల్ చేశారు.. యంగ్ లుక్ లో ఒళ్ళంతా బ్లడ్ తో కత్తి పట్టుకొని చాలా సీరియస్ గా విజయ్ సేతుపతి ఈ లుక్ లో ఉన్నాడు. ఫైట్ సీక్వెన్స్ కి సంబందించిన స్టిల్ ని విజయ్ సేతుపతి ఫస్ట్ లుక్ గా రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది.

మంజు వారియర్ విడుదల 2లో విజయ్ సేతుపతికి జోడీగా నటించింది. విజయ్, మంజు వారియర్ కి సంబందించిన మరో లుక్ కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సినిమాకి మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తూ ఉండటం విశేషం. ఆర్.ఎస్. ఇన్ ఫాటిమెంట్, ఏ గ్రాస్ రూట్ ఫిల్మ్ కంపెనీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది.