తల్లిదండ్రుల ముందే హీరోయిన్ ని అవమానించిన నిర్మాత!
అయితే కెరీర్ లో ఎదిగే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నట్లు తాజాగా రివీల్ చేసింది.
By: Tupaki Desk | 27 Oct 2024 8:30 PM GMTబాలీవుడ్ లో విద్యాబాలన్ నటిగా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండానే ఎదిగింది. చిన్నగా కెరీర్ ప్రారంభించి నేడు సోలోగా సత్తా చాటే నాయికగా ఎదిగింది. కమర్శియల్ చిత్రాలతోపాటు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లోనూ బాక్సాఫీస్ నాయిక అయింది. అయితే కెరీర్ లో ఎదిగే సమయంలో ఎన్నో అవమానాలు ఎదుర్కున్నట్లు తాజాగా రివీల్ చేసింది. 'చక్రం' అనే మలయాళ సినిమాతో ఎంట్రీ ఇచ్చా. అందులో మోహన్ లాల్ హీరో.
తొలి సినిమాతోనే అతనితో ఛాన్స్ రావడంతో వెంటనే చాలా అవకాశాలు వచ్చాయి. అయితే కొన్ని కారణాలుగా చక్రం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో మిగిలిన సినిమాల్లో నన్ను తొలగించి వేరే హీరోయిన్లను పెట్టుకున్నారు. దీంతో నేను మూడేళ్ల పాటు బాధపడ్డా. ఏం జరుగుతుందో అర్దం కాలేదు. కుంగుబాటుకు లోనయ్యాను. ఇంట్లో రోజూ గొడవలు జరుగుతుండేవి. నీతోటి వారంతా జీవితంలో స్థిరపడ్డారు.
నువ్వెందుకిలా అయ్యావ్? ఇక్కడే ఆగిపోయావ్? బంగారం లాంటి భవిష్యత్ నాశనం చేసుకున్నావ్? సినిమాలు మనకి సూటవ్వవని అమ్మ చెప్పేది. ఆ తర్వాత కొంత కాలానికి ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది. అయితే `చక్రం` ఆగిందని ఆ సినిమా నిర్మాతకు తెలిసింది. దాంతో ఆయన నా జాతకం చూపించారు. తమ సినిమాకీ సెట్ కావని తొలగించారు. ఆ తర్వాత అదే నిర్మాతను నా తల్లిదండ్రులు కలిసారు. షూట్ చేసిన భాగాన్ని తల్లిదండ్రులకు చూపించి ఆ దక్షిణాది నిర్మాత నటన రాదు, డాన్స్ రాదు.
ఆవిడెందుకండి సినిమాలకు అని అవమానించాడు. దీంతో ఆరు నెలలు పాటు అద్దంలో ముఖంచూసుకోలేదు. నా పై నాకే అసహ్యం వేసింది. అది నేను చేసిన తప్పా? లేక అవతలి వారి తప్పా? అన్నది అర్దం కాక అమ్మ చెప్పింది నిజమేనా? అని తీవ్ర సంఘర్షణకు గురయ్యాను. అలా ఆత్మ విశ్వాసం కోల్పోయిన సమయంలో ప్రదీప్ సర్కార్ పిలిచి అవకాశం ఇచ్చారు` అని అన్నారు.